కృష్ణలా ఫోన్‌ చేయడం ఏ హీరోకి సాధ్యం కాదు: నటుడు గిరిబాబు | Actor giribabu about super star krishna | Sakshi
Sakshi News home page

Actor Giri Babu : ఫిదా అయిన సూపర్‌స్టార్‌ కృష్ణ.. గిరిబాబుకు ఫోన్‌ కాల్‌

Nov 14 2026 4:59 PM | Updated on Nov 14 2026 5:04 PM

Actor giribabu about super star krishna

టాలీవుడ్‌లో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్న నటుడు గిరిబాబు ఈ రోజు కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.  కొన్ని దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అయితే గతంలో ఆయన సూపర్‌స్టార్‌ కృష్ణ ఆయన్ను అభినందించిన తీరును గిరిబాబు గుర్తుచేసుకున్నారు. ఈ విషయాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

 ఏ హీరో వల్లా సాధ్యం కాదు
'దొంగోడొచ్చాడు సినిమా విడుదలైన మరుసటి రోజు కృష్ణగారు నాకు ఫోన్‌ చేశారు. గిరిబాబు.. ఈ సినిమా 14 వారాలు ఆడుతుంది. అందులో నాలుగు వారాలు నా వల్ల ఆడితే.. మిగతా పది వారాలు నీ కామెడీ వల్లే ఆడుతుంది అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా ఫోన్‌ చేసి బాగా నటించావయ్యా అని అభినందిస్తారు. కానీ.. కృష్ణగారిలా ఫోన్‌ చేసి నీ వల్లే సినిమా ఆడిందని చెప్పడం ఏ హీరో వల్లా సాధ్యం కాదు' అని ఆయన పేర్కొన్నారు.

ఒక అగ్ర కథానాయకుడిగా ఉన్నప్పటికీ తోటి నటుడి ప్రతిభను గుర్తించి, స్వయంగా ఫోన్‌ చేసి అభినందించడం కృష్ణ గొప్ప మనసుకు నిదర్శనమని గిరిబాబు కొనియాడారు.  అభిమానులు కృష్ణ గొప్పతనాన్ని, గిరిబాబుతో ఆయనకున్న అనుబంధాన్ని ఈ వీడియోలతో గుర్తుచేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: విషాదం.. సినీ నటుడు గిరిబాబు కన్నుమూత)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement