ఆనంది, రాగ్ మయూర్ జంటగా, వీకే నరేష్, రాశి, శరణ్య, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `గరివిడి లక్ష్మి`. ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు. బయోపిక్ తరహాలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్స్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
(చదవండి: డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయించారు.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్)
ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ‘చందమామ’ పాటకు అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో వేల సంఖ్యల్లో రీల్స్ చేశారు. రిలీజ్ తర్వాత కూడా ఈ పాట తెగ వైరల్ అయింది. తాజాగాయూట్యూబ్‌లో ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఈ పాటకు మీరు కూడా ఒక్కసారి చూసేయండి.


