చాహల్ మాజీ భార్య తెలుగు సినిమా.. ఎట్టకేలకు రిలీజ్ | Dhanashree Verma Telugu Movie Release Date | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత రిలీజ్.. టైటిల్ మార్చేశారు

Nov 14 2026 12:30 PM | Updated on Nov 14 2026 12:30 PM

Dhanashree Verma Telugu Movie Release Date

టీమిండియా క్రికెటర్ చాహల్.. ధనశ్రీ వర్మ అనే ఇన్ఫ్లూయెన్సర్‌ని పెళ్లి చేసుకుని గతేడాది విడాకులు కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఎవరిపనిలో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే ధనశ్రీ.. తెలుగులో హీరోయిన్‌గా ఓ సినిమా చేసింది. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ‍త్రిగుణ్ కూతురిని చూశారా? ఇదేం కెప్టెన్సీ టాస్క్)

డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు యశ్వంత్ అలియాస్ యష్ మాస్టర్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో దాదాపు నాలుగేళ్ల క్రితం ఓ సినిమా ప్రారంభమైంది. దీనికి తొలుత 'ఆకాశం దాటి వస్తావా' అని టైటిల్ ఫిక్స్ చేశారు. గ్లింప్స్ వీడియో కూడా వదిలారు. తర్వాత ఏమైందో ఏమో గానీ ఈ ప్రాజెక్ట్ పక్కనబెట్టేశారు. ఇందులోనే ఓ హీరోయిన్‌గా చాహల్ మాజీ భార్య ధనశ్రీ చేస్తున్నట్లు గతేడాది వార్తలొచ్చాయి.

ఇప్పుడు ఈ సినిమా పేరుని మార్చేశారు. 'హే కన్నమ్మ' అనే టైటిల్‌తో త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు యశ్వంత్ తన ఇన్ స్టాలో కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు. శశికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.

(ఇదీ చదవండి: మరో హీరోయిన్‌కి పెళ్లి.. బ్యాచిలర్ పార్టీ వీడియో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement