టాలీవుడ్‌లో రాబోయే కొన్నిరోజుల్లో చాలానే పెళ్లిళ్లు జరగబోతున్నాయి. హీరోలు సాయిధరమ్ తేజ్, తేజా సజ్జా.. త్వరలోనే తమ ప్రియురాళ్లతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. మరోవైపు కీరవాణి కొడుకు కాలభైరవ, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ కూడా పెళ్లి చేసుకోనున్నారు. రీసెంట్‌గా 'ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో హీరోయిన్ కూడా చేరేందుకు సిద్ధమైంది.
(ఇదీ చదవండి: సేతుపతికి భార్యగా.. కవల పిల్లలకు తల్లిగా)
ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుని సర్‌ప్రైజ్ చేసిన తమిళ హీరోయిన్ మిర్నాళిని రవి.. త్వరలో పెళ్లి చేసుకుంది. పుదుచ్చేరికి చెందిన ఈమె 2019లో వచ్చిన విజయ్ సేతుపతి 'సూపర్ డీలక్స్'తో నటిగా పరిచయమైంది. తర్వాత 'గద్దలకొండ గణేశ్'తో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర మూవీస్ చేసింది. తమిళంలో ఛాంపియన్, ఎనిమీ, ఎమ్జీఆర్ మగన్, జంగో, కోబ్రా తదితర మూవీస్ చేసింది. చివరగా 2024లో 'రోమియో' అనే తమిళ చిత్రంలో నటించింది.

గత రెండేళ్లుగా యాక్టింగ్‌కి దూరమైన ఇప్పుడు ఉన్నట్టుండి సడన్‌గా తనకు నిశ్చితార్థమైన విషయాన్ని బయటపెట్టింది. మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త సినిమాలేం చేయట్లేదు. చూస్తుంటే నటనకు మిర్నాళిని వీడ్కోలు చెప్పేసినట్లే కనిపిస్తోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: త్రిగుణ్ కూతురిని చూశారా? ఇదేం కెప్టెన్సీ టాస్క్)


