మహేశ్ బాబు ఫ్యామిలీలోనూ పెళ్లి సందడి | Mahesh Babu Nephew Sid Galla Marriage Latest | Sakshi
Sakshi News home page

Mahesh Babu Nephew: మహేశ్ మేనల్లుడు పెళ్లికి రెడీ.. నమ్రత పోస్ట్ వైరల్

Nov 13 2026 8:51 AM | Updated on Nov 13 2026 8:51 AM

Mahesh Babu Nephew Sid Galla Marriage Latest

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. రెండు రోజుల క్రితమే 'ఇరుముడి' హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ పెళ్లి చేసుకోగా టాలీవుడ్ హీరోలు సాయిధరమ్ తేజ్, తేజా సజ్జా కూడా వచ్చే నెలలో వివాహ బంధాల్లోకి అడుగుపెట్టనున్నారు. మరోవైపు మహేశ్ బాబు కుటుంబంలోనూ పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు మొదలైపోయాయి. నమ్రత ఈ ఫొటోలని షేర్ చేసింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'ఇరుముడి' హీరోయిన్)

గల్లా జయదేవ్, పద్మావతి దంపతుల కుమారుడు.. మహేశ్ బాబు మేనల్లుడు గల్లా సిద్ధార్థ్.. మరికొన్నిరోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దక్షిణ కొరియాకు చెందిన అమ్మాయి సొయిరిని వివాహం చేసుకోనున్నాడు. ఈ ఏడాది జూలైలో వీళ్ల నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు.

సిద్ధార్థ్ ప్రస్తుతం కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. కొరియన్ అమ్మాయి ఎక్కడ ఎలా ప్రేమ మొదలైందో గానీ ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యాడు. గతంలో జరిగిన నిశ్చితార్థంలోనూ కనిపించని మహేశ్.. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లోనూ కనిపించలేదు. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ హీరోగా చేసిన 'వారణాసి' వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: ‘రామాయణం’పై మహేశ్‌బాబు కొడుకు రివ్యూ)

(ఇదీ చదవండి: తెలుగు 'బిగ్‌బాస్'లో నిశ్చితార్థం చేసుకున్న ప్రేమజంట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement