సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తన డ్యాన్స్‌తో అభిమానులను ఆశ్చర్చపరిచారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ వేడుకలో ఆయన ఉత్సాహంగా స్టెప్పులేశారు. నవంబర్ 11 న గ్రీస్‌లో జరిగిన ఈ వేడుకలో తన సినిమా పాటకు కొత్త దంపతులతో కలిసి రజనీకాంత్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 75 ఏళ్ల వయసులోనూ ఆయన చూపించిన ఉత్సాహం అభిమానులను కట్టిపడేస్తోంది.
చెన్నైలో..
రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ సినిమాలోని ‘మనసిలాయో’ పాటకు ఆయన డ్యాన్స్ చేశారు. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం విశేషం. కొత్త దంపతులు అనిరుధ్, కావ్య మారన్ కూడా ఆయనతో కలిసి సందడి చేశారు. కాగా ఈ వేడుకకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నవంబర్ 21 న చెన్నైలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
(ఇదీ చదవండి: చరిత్రలోనే బిగ్‌బాస్ హౌస్‌లో రియల్ ఎంగేజ్‌మెంట్..!)
Thalaivar #Rajinikanth dance in Anirudh Kavya wedding #Anirudh #anirudhwedding #Anirudh_Kavya_Wedding https://t.co/nXOiOZXVNW
— Shakthi (@shakthispeaks) November 11, 2026


