హీరోగా నిలదొక్కుకోవడం ఆషామాషీ కాదు | Manchu Speech Manoj at GOAT Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

హీరోగా నిలదొక్కుకోవడం ఆషామాషీ కాదు

Nov 12 2026 4:56 AM | Updated on Nov 12 2026 4:56 AM

Manchu Speech Manoj at GOAT Movie Pre Release Event

– మంచు మనోజ్‌ 

‘‘ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలంటే అంత ఆషామాషీ కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఈ విషయంలో సుధీర్‌ చాలా కష్టపడుతున్నాడు. ‘గోట్‌’ సినిమా సుధీర్‌తో పాటు యూనిట్‌ అందరికీ మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను’’ అని హీరో మంచు మనోజ్‌ పేర్కొన్నారు. సుడిగాలి సుధీర్‌ హీరోగా, దివ్య భారతి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘జీ.ఓ.ఏ.టీ’(గోట్‌). వేదవ్యాస్‌ దర్శకత్వంలో మొగుళ్ళ చంద్రశేఖర్‌ నిర్మించారు. 

ఏషియన్‌ సినిమాస్‌ సమర్పించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకకు మంచు మనోజ్, నిర్మాత నిరంజన్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదవ్యాస్‌ మాట్లాడుతూ– ‘‘ఆన్‌లైన్‌  బెట్టింగ్‌ వల్ల భారతదేశంలో దాదాపు 20 కోట్ల మంది నష్టపోయారు. ఈ విషయాన్ని వినోదాత్మకంగా, భావోద్వేగాలతో చెప్పాను’’ అన్నారు. ‘‘చిరంజీవిగారికి ‘ఖైదీ’ సినిమాలా సుధీర్‌కు ‘గోట్‌’ ఉంటుంది’’ అన్నారు చంద్రశేఖర్‌ రెడ్డి. ‘‘ఈ సినిమా చూసి, నచ్చితే పది మందికి చెప్పండి’’ అని సుడిగాలి సుధీర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement