సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తబిత సుకుమార్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్‌పై ఓ ప్రేమకథా చిత్రం ఆరంభమైంది. సుకుమార్ టీమ్‌లో కీలక రచయితగా పని చేస్తున్న మోహన్ బి. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సుకుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.
హరీష్ శంకర్, నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు విశ్వప్రసాద్, బాపినీడు, దర్శకులు బుచ్చిబాబు, చందు మొండేటి యూనిట్‌కి స్క్రిప్ట్ అందించారు. ‘‘ఈ సినిమా కోసం మోహన్ కొత్త తరహా ప్రేమకథను సిద్ధం చేశారు. సిద్ధు జొన్నలగడ్డను పూర్తిగా కొత్త లుక్‌లో చూపించనున్నారాయన’’ అని యూనిట్ పేర్కొంది. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: చంద్రు సెల్వరాజ్.


