ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వంశిత అనే అమ్మాయిని పెళ్లాడగా..ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెల్‌కమ్ టూ మై న్యూ ఎంజెల్ అంటూ పటాస్ ప్రవీణ్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.
కాగా.. పటాస్ ప్రవీణ్ విషయాకొనిస్తే పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై తన కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో ఫైమాతో కలిసి ప్రవీణ్ ఎక్కువగా కనిపించారు. వీరిద్దరు కలిసి ఎన్నో స్కిట్స్ చేశారు.


