నన్ను అవమానించారు, అందుకే ఫ్లాప్‌ అయింది.. ‘ప్యారడైజ్‌’పై బాబు మోహన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ | Babu Mohan Shocking Comments On Nani The paradise Movie | Sakshi
Sakshi News home page

నన్ను తీసుకోలేదు..అందుకే ప్లాఫ్‌ అయింది: ‘ప్యారడైజ్‌’పై బాబు మోహన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Nov 11 2026 6:29 PM | Updated on Nov 11 2026 6:47 PM

Babu Mohan Shocking Comments On Nani The paradise Movie

‘ది ప్యారడైజ్’ మూవీ మేకర్స్‌పై  సీనియర్‌ నటుడు, కమెడియన్‌  బాబుమోహన్‌  సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో పాత్ర కోసం పిలిపించి..తనను అవమానించారని ఆరోపించారు. దరిద్రం వెంటపడి వాళ్లను తనను పెట్టుకోలేదని.. అందుకే సినిమా ఒక్క రోజు కూడా ఆడలేదని విమర్శించారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం ది ప్యారడైజ్‌. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.  అయితే ఈ చిత్రంలో బాబు మోహన్‌ ఓ కీలక పాత్ర పోషించాల్సింది. లుక్‌ టెస్ట్‌ కూడా చేశారు.  కారణం ఏంటో కానీ.. అతన్ని సినిమాలోకి తీసుకోలేదు. షూటింగ్‌  పూర్తయి..రిలీజ్‌ డేట్‌ ప్రకటించేవరకు కూడా బాబు మోహన్‌  ఆ పాత్ర కోసం పిలుపు వస్తుందని ఎదురు చూశారట. కనీసం సినిమాలోకి తీసుకోవడం లేదనే విషయం కూడా తనకు చెప్పలేదని మేకర్స్‌పై ఫైర్‌ అయ్యాడు బాబు మోహన్‌. 

(చదవండి: అనిరుధ్- కావ్య వెడ్డింగ్.. ఎంగేజ్‌మెంట్‌ వీడియో వైరల్)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్యారడైజ్‌ సినిమా గురించి యాంకర్‌ ప్రస్తావించగా.. ‘ప్యారడైజ్‌లో ఓ మంచి పాత్ర కోసం నన్ను పిలిచారు. నా కెరీర్‌లోనే తొలిసారి మేకప్‌ టెస్ట్‌ చేశారు. అందరూ బ్రహ్మండంగా ఉందని మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. షూటింగ్‌ కోసం పిలుపు రాలేదు. మేకర్స్‌  నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. రిలీజ్‌ డేట్‌  ప్రకటించేవరకు షూటింగ్‌ కోసం పిలుస్తారేమోనని ఎదురు చూశా.  నేను పనికి రానుకున్నారో ఏమో కానీ నాకు పిలుపు రాలేదు. మరి నాకన్నా బెటర్ యాక్టర్ దొరుకుతాడని నన్ను వద్దన్నారా లేక దరిద్రం వెంటపడి ఆ సినిమా హిట్ అవ్వకూడదని, లక్కీ హ్యాండ్ అయిన నన్ను ఆ సినిమాలో పెట్టకోలేదో తెలియదు. 

ఈవీవీ చెవిలో పువ్వు అనే సినిమా చేస్తే అట్టర్‌  ప్లాఫ్‌ అయింది. ఆ తర్వాత నన్ను పెట్టుకొని ప్రేమ ఖైదీ అనే సినిమా తీస్తే.. సూపర్‌ హిట్‌ అయింది. ‘మామగారు’, ‘మాయలోడు’, ‘చిన్నరాయుడు’, ‘పెద్దరాయుడు’, ‘బావ బావమరిది’ లాంటి సినిమాలో డిఫరెంట్‌ డిఫరెంట్‌ పాత్రలు చేశా. ప్రతి క్యారెక్టర్‌కు ఒక స్పెషల్ బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ ఉంటుంది. అలాంటి నన్ను ది ప్యారడైజ్‌ టీమ్‌ పిలిపించి అవమానించింది. ప్లాప్‌ అవ్వాలని వాళ్లకు రాసిపెట్టి ఉందేమో..అందుకే నన్ను తీసుకోలేదు.  ఆ సినిమా థియేటర్స్‌లో ఒక్క రోజు కూడా ఆడలేదని విన్నాను.  కనీసం సమాచారం అయినా ఇవ్వాలనే సంస్కారం వాళ్లకు(ప్యారడైజ్‌ టీమ్‌) ఉండాలి’ అని బాబు మోహన్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement