ఇస్కాన్‌ వ్యవస్థాపకులు ‘స్వామి ప్రభుపాద’పై బయోపిక్‌.. | Biopic on Iskcon Founder Swami Prabhupada | Sakshi
Sakshi News home page

ఇస్కాన్‌ వ్యవస్థాపకులు ‘స్వామి ప్రభుపాద’పై బయోపిక్‌..

Nov 10 2026 9:15 PM | Updated on Nov 10 2026 9:17 PM

Biopic on Iskcon Founder Swami Prabhupada

కేజీఎఫ్‌, కాంతార వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ట్రాన్స్‌సెండెంటల్‌ ఫిల్మ్స్‌తో కలిసి ‘శరణాగతి – ది లైఫ్‌ ఆఫ్‌ ఏ సరెండర్డ్‌ సోల్‌’ పేరుతో యానిమేటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వెల్లడించింది. ఇస్కాన్‌ వ్యవస్థాపకుడు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

భారతీయ సంస్కృతి నేపథ్యంలో
ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అత్యాధునిక ఏఐ మోషన్‌ క్యాప్చర్‌ సాంకేతికతతో రూపొందించనున్నారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ప్రభుపాద జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఇందులో చూపించనున్నారు. ఆయన ప్రయాణం, జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, ప్రపంచవ్యాప్తంగా భక్తి మార్గాన్ని విస్తరించేందుకు చేసిన కృషిని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు అందించనున్నారు.

ఇక ఈ చిత్రాన్ని 2027 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. కేజీఎఫ్‌, కాంతార వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత హోంబలే ఫిల్మ్స్‌ నుంచి వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

(ఇదీ చదవండి: రావణుడి పాత్ర.. యశ్‌ కాస్ట్యూమ్స్‌ బరువు ఎంతంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement