అందరికీ రిలేట్ అయ్యేలా ‘ఇంకా ఏం అనుకోలేదు!’ | Producer Vamsi Nandipati Talk About Inka Em Anukoledhu At Song Launch Event | Sakshi
Sakshi News home page

అందరికీ రిలేట్ అయ్యేలా ‘ఇంకా ఏం అనుకోలేదు!’

Nov 10 2026 7:59 PM | Updated on Nov 10 2026 8:04 PM

Producer Vamsi Nandipati Talk About Inka Em Anukoledhu At Song Launch Event

అక్షయ్ లగుసాని, కేయూరి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు’. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన  ఈ చిత్రంలో , జయకృష్ణ, రావు రమేష్, హర్షవర్థన్‌, అనిత చౌదరి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని డిసెంబర్ 11న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ‘మేఘాలు సంద్రంలో’ అంటూ సాగే సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో..వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గిరి, ప్రణయ్ చెప్పిన ఈ కథ నాకు ఎంతో నచ్చింది. ఈ ఇద్దరి పేర్లు ఇండస్ట్రీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది. సింజిత్ అద్భుతమైన పాటల్ని ఇచ్చాడు. అక్షయ్, సింజిత్ మంచి స్నేహితులు. కేయూరికి ఆల్ ది బెస్ట్. ఈటీవి విన్‌తో కలిసి ఈ మూవీని డిసెంబర్ 11న ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాం. ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు ప్రణయ్ వల్లూరిపల్లి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రానికి సింజిత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అన్ని పాటలు బాగుంటాయి. కిట్టూ మంచి లిరిక్స్ అందించారు. రేహాన్ మంచి విజువల్స్ ఇచ్చారు. అనురాగ్ మంచి మాటలు అందించారు. మా సినిమా డిసెంబర్ 11న రాబోతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’ అని అన్నారు.

(చదవండి: డేట్‌ నైట్స్‌పై కరణ్‌ ప్రశ్న.. కియారా ఫన్నీ ఆన్సర్‌, వీడియో వైరల్‌)

దర్శకుడు గిరి పెమ్మసాని మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాతో మాకు అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవీ విన్ టీంకు థాంక్స్. ఇదే మాకు తొలి చిత్రం. సింజిత్ మంచి సంగీతమందించారు. పాటలన్నీ బాగుంటాయి. మున్ముందు మరిన్ని ఈవెంట్లలో ఆడియెన్స్ ముందుకు వస్తాం. మా సినిమా డిసెంబర్ 11న రాబోతోంది’ అని అన్నారు.

అక్షయ్ లగుసాని మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన వంశీ గారికి, ఈటీవి విన్ టీంకి థాంక్స్. ఈ ఈవెంట్‌కి సింజిత్ హీరో. అతను నా ఫ్లాట్ మేట్. 24 గంటలూ పని చేస్తూనే ఉంటాడు. మా కోసం మంచి పాటల్ని ఇచ్చాడు. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డిసెంబర్ 11న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.

కేయూరి మాట్లాడుతూ .. ‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రంలో అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవి విన్ టీంకు థాంక్స్. నాకు మంచి పాత్రను ఇచ్చిన ప్రణయ్, గిరికి థాంక్స్. అక్షయ్, జైకృష్ణ గురించి మున్ముందు ఈవెంట్లలో మాట్లాడతాను. మేం రిలీజ్ చేసిన పాట అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement