Vamsi Nandipati
-
సినిమా టైటిల్.. ‘ఇంకా ఏం అనుకోలేదు’
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు నిర్మాత వంశీ నందిపాటి. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘హే బల్వంత్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన..తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించారు. ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి ‘ఇంకా ఎం అనుకోలేదు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సంగీతాన్ని సింజిత్ ఎర్రమిల్లి అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రేహాన్ షేక్ నిర్వహిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ అనౌన్స్మెంట్ వీడియోపై, టైటిల్‌పైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణ ప్రమోషన్ విధానాన్ని కాకుండా, వినూత్నంగా మీమ్స్‌తో నిండిన సరదా వీడియో ద్వారా టైటిల్‌ను ప్రకటించారు. ఇందులో వ్యంగ్యంతో పాటు పాత ఈటీవీ థీమ్‌ను గుర్తుచేసే అంశాలు, హాస్యభరితమైన శైలి కనిపించాయి.వీడియోలో వివిధ మీమ్ రిఫరెన్స్‌లు, చమత్కారమైన పంచ్‌లు వినోదాన్ని పెంచాయి. ఇంటర్నెట్ స్టైల్ కామెడీతో రూపొందిన ఈ క్లిప్ ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే ఈ ప్రకటనలో నటీనటుల వివరాలను మేకర్స్ వెల్లడించకుండా ఉంచడం ఆసక్తిని మరింత పెంచింది. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ బ్రోమాంటిక్ కామెడీ చిత్రానికి రమణా రెడ్డి, సమీర్ కన్ను సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. -
నటి లయపై నిర్మాత వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు
-
టాలీవుడ్లో నటి లయపై నిర్మాత వ్యాఖ్యల దుమారం
లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత వంశీ నందిపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో చిత్రయూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్మీట్లో నటి లయ గురించి మాట్లాడుతూ వంశీ నందిపాటి..‘నందులను పందుల్లా పెంచింది’అని వ్యాఖ్యానించారు.ఈ మాటలు అక్కడే ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేయగా, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి గురించి ఇలాంటి పదజాలం ఉపయోగించడం నిర్మాతకు తగదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి కారణమయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా భావించే నంది అవార్డులను తక్కువ చేసి మాట్లాడడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అవార్డులు తెలుగు సినిమా ప్రతిష్టకు ప్రతీకగా నిలుస్తాయని, వాటిని అవమానించేలా వ్యాఖ్యానించడం సరైనది కాదని సినీ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు.వంశీ నందిపాటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఆయనపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి. కొందరు ఆయనను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కొంతమంది మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వంశీ ఉద్దేశం అంతకంటే వేరుగా ఉండవచ్చని అంటున్నారు.


