ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది | Vamsi Nandipati Made Interesting Comments About Ameer Log Movie At Teaser Release Event, Deets Inside | Sakshi
Sakshi News home page

ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది

Jul 7 2026 10:02 AM | Updated on Jul 7 2026 11:00 AM

Vamsi Nandipati Talk About Ameer Log Movie At Teaser Release Event

 - వంశీ నందిపాటి

‘అమీర్‌ లోగ్‌’ సినిమాలో మధ్య తరగతి జీవితాలను చూపించారు. ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది’’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వంశీ నందిపాటి చెప్పారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్‌ హీరోలుగా నటించిన సినిమా ‘అమీర్‌ లోగ్‌’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించారు. 

ఈ చిత్రాన్ని హీరో రానాకి చెందిన స్పిరిట్‌ మీడియా త్వరలోనే రిలీజ్‌ చేయనుంది. ఈ మూవీ టీజర్‌ని వంశీ నందిపాటి రిలీజ్‌ చేశారు. ‘‘మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చెప్పారు రమణా రెడ్డి. ‘‘టీజర్‌లాగానే సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని తెలిపారు మనోజ్‌. ఈ కార్యక్రమంలో నటీనటులు వేద జలంధర్, విశ్వేందర్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి, సంగీత దర్శకుడు స్మరణ్‌ సాయి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సందీప్, ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సినిమా నిర్మాత వెంకట కృష్ణ మాట్లాడారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement