breaking news
Inka Em Anukoledhu Movie
-
అందరికీ రిలేట్ అయ్యేలా ‘ఇంకా ఏం అనుకోలేదు!’
అక్షయ్ లగుసాని, కేయూరి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు’. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో , జయకృష్ణ, రావు రమేష్, హర్షవర్థన్, అనిత చౌదరి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని డిసెంబర్ 11న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ‘మేఘాలు సంద్రంలో’ అంటూ సాగే సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో..వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గిరి, ప్రణయ్ చెప్పిన ఈ కథ నాకు ఎంతో నచ్చింది. ఈ ఇద్దరి పేర్లు ఇండస్ట్రీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది. సింజిత్ అద్భుతమైన పాటల్ని ఇచ్చాడు. అక్షయ్, సింజిత్ మంచి స్నేహితులు. కేయూరికి ఆల్ ది బెస్ట్. ఈటీవి విన్‌తో కలిసి ఈ మూవీని డిసెంబర్ 11న ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాం. ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.దర్శకుడు ప్రణయ్ వల్లూరిపల్లి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రానికి సింజిత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అన్ని పాటలు బాగుంటాయి. కిట్టూ మంచి లిరిక్స్ అందించారు. రేహాన్ మంచి విజువల్స్ ఇచ్చారు. అనురాగ్ మంచి మాటలు అందించారు. మా సినిమా డిసెంబర్ 11న రాబోతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’ అని అన్నారు.(చదవండి: డేట్ నైట్స్‌పై కరణ్ ప్రశ్న.. కియారా ఫన్నీ ఆన్సర్, వీడియో వైరల్)దర్శకుడు గిరి పెమ్మసాని మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాతో మాకు అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవీ విన్ టీంకు థాంక్స్. ఇదే మాకు తొలి చిత్రం. సింజిత్ మంచి సంగీతమందించారు. పాటలన్నీ బాగుంటాయి. మున్ముందు మరిన్ని ఈవెంట్లలో ఆడియెన్స్ ముందుకు వస్తాం. మా సినిమా డిసెంబర్ 11న రాబోతోంది’ అని అన్నారు.అక్షయ్ లగుసాని మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన వంశీ గారికి, ఈటీవి విన్ టీంకి థాంక్స్. ఈ ఈవెంట్‌కి సింజిత్ హీరో. అతను నా ఫ్లాట్ మేట్. 24 గంటలూ పని చేస్తూనే ఉంటాడు. మా కోసం మంచి పాటల్ని ఇచ్చాడు. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డిసెంబర్ 11న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.కేయూరి మాట్లాడుతూ .. ‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రంలో అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవి విన్ టీంకు థాంక్స్. నాకు మంచి పాత్రను ఇచ్చిన ప్రణయ్, గిరికి థాంక్స్. అక్షయ్, జైకృష్ణ గురించి మున్ముందు ఈవెంట్లలో మాట్లాడతాను. మేం రిలీజ్ చేసిన పాట అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను’ అని అన్నారు. -
సినిమా టైటిల్.. ‘ఇంకా ఏం అనుకోలేదు’
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు నిర్మాత వంశీ నందిపాటి. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘హే బల్వంత్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన..తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించారు. ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి ‘ఇంకా ఎం అనుకోలేదు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సంగీతాన్ని సింజిత్ ఎర్రమిల్లి అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రేహాన్ షేక్ నిర్వహిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ అనౌన్స్మెంట్ వీడియోపై, టైటిల్‌పైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణ ప్రమోషన్ విధానాన్ని కాకుండా, వినూత్నంగా మీమ్స్‌తో నిండిన సరదా వీడియో ద్వారా టైటిల్‌ను ప్రకటించారు. ఇందులో వ్యంగ్యంతో పాటు పాత ఈటీవీ థీమ్‌ను గుర్తుచేసే అంశాలు, హాస్యభరితమైన శైలి కనిపించాయి.వీడియోలో వివిధ మీమ్ రిఫరెన్స్‌లు, చమత్కారమైన పంచ్‌లు వినోదాన్ని పెంచాయి. ఇంటర్నెట్ స్టైల్ కామెడీతో రూపొందిన ఈ క్లిప్ ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే ఈ ప్రకటనలో నటీనటుల వివరాలను మేకర్స్ వెల్లడించకుండా ఉంచడం ఆసక్తిని మరింత పెంచింది. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ బ్రోమాంటిక్ కామెడీ చిత్రానికి రమణా రెడ్డి, సమీర్ కన్ను సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.


