26 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ రీ ఎంట్రీ.. ఆ స్టార్‌ హీరో మూవీతోనే..! | Tollywood actress Renu Desai Re entry Into Kollywood after 26 years | Sakshi
Sakshi News home page

Renu Desai: 26 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. ఆ స్టార్‌ హీరో మూవీతోనే..!

Nov 11 2026 4:42 PM | Updated on Nov 11 2026 4:42 PM

Tollywood actress Renu Desai Re entry Into Kollywood after 26 years

రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్. తాజాగా మరోసారి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సారి కోలీవుడ్‌లో పునరాగమనం చేయనుంది. ధనుశ్ హీరోగా వస్తోన్న ఓం చాప్టర్-1 మూవీలో రేణు కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఆమె నటిస్తున్నారా? లేదా అన్న వార్తలకు చెక్ పడింది. కాగా.. ఈ మూవీకి అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.

గతల మే నెలలోనే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో కలిసి దిగిన ఫోటోలను రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ సమయంలోనే ఆమె ఓం సినిమాలో నటిస్తున్నారనే ఊహాగానాలొచ్చాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ ఆమె పెట్టిన పోస్ట్‌తో ఈ సస్పెన్స్‌కు తెరపడింది. గతంలో 2000 ఏడాదిలో  జేమ్స్ పాండు తర్వాత రేణూ దేశాయ్ మళ్లీ అక్కడ ఎలాంటి సినిమా చేయలేదు.

దాదాపు ఇరవై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళ తెరపైకి రీఎంట్రీ ఇస్తోంది. దీంతో ఓం సినిమాపై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ఆమె రోల్ వివరాలు చాలా సీక్రెట్‌గా ఉంచారు. ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు మమ్ముట్టి, ఇంద్రన్స్, నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement