గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'రామాయణ'..ఊహించని విధంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు రూ.663 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఇదలా ఉండగానే ఆస్కార్ బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: కొత్త హీరో కోసం ఏకంగా చరణ్, ఎన్టీఆర్, నాగార్జున.. ఎవరీ కుర్రాడు?)
99వ అకాడమీ అవార్డుల పరిశీలన కోసం చిత్ర నిర్మాతలు ఈ సినిమాను పంపించారు. ఆస్కార్ బరిలో భారత్ తరఫున అధికారికంగా కాకుండా అకాడమీ నిర్దేశించిన అర్హతలని పూర్తి చేసిన సినిమాలు ఇతర విభాగాల్లో స్వతంత్రంగా పోటీకి తమ పేర్లను పంపించుకోవచ్చు. ఈ విభాగంలోనే ‘రామాయణ’ నామినేషన్ వేసింది.
అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 99వ ఆస్కార్ అవార్డుల కోసం భారత్ తరఫున మరాఠీ చిత్రం ‘గోంధల్’ అధికారికంగా ఎంపికైంది. మరోవైపు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డ్ గెలుచుకున్న ‘అంఘ్’ కూడా ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది. ఇప్పుడు 'రామాయణ' కూడా రేసులో నిలబడింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'ఇరుముడి' హీరోయిన్)


