‘రామాయణం’కి షాక్‌ ఇచ్చిన ‘గాడ్జిల్లా’ | Godzilla Minus Zero Beats Ramayana in box office | Sakshi
Sakshi News home page

‘రామాయణం’కి షాక్‌ ఇచ్చిన ‘గాడ్జిల్లా’

Nov 9 2026 6:58 PM | Updated on Nov 9 2026 7:14 PM

Godzilla Minus Zero Beats Ramayana in box office

జపాన్‌కు చెందిన టోహో సంస్థ నిర్మించిన భారీ చిత్రం ‘గాడ్జిల్లా మైనస్‌ జీరో’. నవంబరు 6న విడుదలైంది.  ఈ మూవీ బాక్సాఫీస్‌లో దూసుకుపోతోంది. ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌ వద్ద రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన ‘రామాయణం’ ను వెనక్కి నెట్టి తొలిస్థానంలో నిలిచింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడ ఈ చిత్రం 31.6 మిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాల చెబుతున్నాయి.

‘రామాయణ’ విషయానికి వస్తే.. 8.7 మిలియన్‌ డాలర్లతో ఐదో స్థానానికి పరిమితమైందని తెలుస్తోంది. నాలుగు రోజుల ఓపెనింగ్‌ వీకెండ్‌తో కలిపి ఈ సినిమా అక్కడ 12.2 మిలియన్‌ డాలర్లు రాబట్టిందని సమాచారం.

‘గాడ్జిల్లా’ సంగతేంటి?
2023లో వచ్చిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’ కి సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే ఇది. తకాషి యమజాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం  రెండో ప్రపంచ యుద్ధం నుంచి జపాన్‌ కోలుకుంటున్న సమయంలో భయంకర రాక్షస జీవి కింగ్‌ ఘిడోరా రూపంలో ఆ ప్రమాదం ఎదురవుతుంది. దీనిని ఎలా ఎదుర్కొన్నారన్నదే మిగతా కథ. 

(ఇదీ చదవండి: సూర్య ‘సీన్‌’ మూవీపై మహేశ్‌బాబు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement