బొద్దుగా..లావుగా ఉండేవాడిని.. అలా కాకుండా ఉంటే: ఎన్టీఆర్‌ | Jr NTR With Aniesh Itlu Arjuna Interview | Sakshi
Sakshi News home page

Jr NTR: ‘బరువు తగ్గి సినిమాలు చేసుంటే బాగుండేది’

Nov 9 2026 3:50 PM | Updated on Nov 9 2026 3:59 PM

Jr NTR With Aniesh Itlu Arjuna Interview

అనీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఇట్లు అర్జున'. అనస్వర రాజన్ హీరోయిన్. ఈనెల 13న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు చేస్తున్నారు. అక్కినేని నాగార్జున సమర్పణలో ఈ చిత్ర రూపొందుతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

 ఏదీ మనసుకి తీసుకోను
హీరో అనీష్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ..‘ మొదటి సినిమా అని కాదు. ఇప్పటికీ నా సినిమా రిలీజ్ అవుతుందంటే నాకు నిద్ర పట్టదు. చాలా నెర్వస్ గా ఉంటాను. సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా మ్యాగ్జిమమ్ ఒకరోజు ఉంటుంది అంతే.  ఒక్కరోజు కంటే ఎక్కువ ఏదీ మనసుకి తీసుకోను. అది ఒకరు చెప్తే రాదు. ఏ నటుడికైనా స్లోగా అర్థమవుతుంది.  ముందుముందు నువ్వు( అనీష్‌) కూడా నేర్చుకుంటావులే' అని ఎన్టీఆర్ తెలిపారు.

యంగ్ లో తాను కొద్దిగా బొద్దుగా లావుగా ఉండేవాడినని.. అలా కాకుండా కొంచం బరువు తగ్గి సినిమాలు చేసుంటే బాగుండేదేమో అనిపిస్తుందని నవ్వుతూ తారక్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ‘రామాయణం’పై ఆర్జీవీ సంచలన కామెంట్స్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement