ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు చెందిన జీ స్క్వాడ్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త సినిమాకు 'RX' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీపావళి సందర్భంగా ఈ టైటిల్‌ను ప్రకటించిన చిత్రబృందం, సత్యం కోసం జరిగే ఒంటరి పోరాటం నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది.
రెజీనా కసాండ్రా, నాజర్, రమేష్ తిలక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం తదుపరి నిర్మాణ కార్యక్రమాల దశలో ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: 90 ఏళ్ల బామ వేడుకోలు.. ఏడాది చిన్నారికి సోనూసూద్ భారీ సాయం)
The battle for truth is often the loneliest one. ⭐ @MythriOfficial X @GSquadOffl 🦂 is titled #RX ــــہہـ٨ـــــــ Starring @ReginaCassandra, @nasser_kameela & @thilak_ramesh #GsquadXMythri @Dir_Lokesh @vishalvenkat_18 @hariharanraju @HeshamAWmusic @selvakumarskdop @editor_prasanna @Manojkennyk @aashameera @PradeepBoopath2 @Jaiisampath @viyaki_s @SureshChandraa @pro_thiru @AbdulNassaroffl @DoneChannel1
— Mythri Movie Makers (@MythriOfficial) November 8, 2026


