దీపావళి రోజున.. స్టార్‌ హీరోల కొత్త అప్‌డేట్స్‌ | tollywood upcoming movies new posters released | Sakshi
Sakshi News home page

దీపావళి రోజున.. కొత్త అప్‌డేట్స్‌

Nov 8 2026 3:53 PM | Updated on Nov 8 2026 4:14 PM

tollywood upcoming movies new posters released

దీపావళి సందర్భంగా స్టార్‌ హీరోల సినిమాల నుంచి కొత్త అప్‌డేట్స్‌ వచ్చాయి. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల నుంచి తాజా పోస్టర్లు విడుదల కాగా.. పలు సినిమాల విడుదల తేదీలను మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు రష్మిక, శ్రుతిహాసన్‌ సినిమాల నుంచి కూడా దీపావళి సందర్భంగా ప్రత్యేక పోస్టర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ విశేషాలేంటో చూద్దాం..
కింగ్‌ 100
నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ 100’. తమిళ నటుడు అశోక్‌ సెల్వన్‌ ఈ సినిమాలో ‘కర్ణ’గా మాస్‌ అవతార్‌లో కనిపించనున్నారు.  ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. రా.కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాకా
మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాకా’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవి ‘కదిరి కాళిదాస్‌’గా కనిపించనున్నారు. తాజాగా చిత్రబృందం మెగాస్టార్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో చిరంజీవి మాస్‌ లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

దాదా..
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దాదా’. బాలయ్యకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. మంచు మనోజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్‌ 24న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో నవంబరు 13న తొలి పాట ‘దాదా ధమాకా’ను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ పాటలో నర్గీస్‌ ఫక్రీ నర్తించనున్నారని తెలుపుతూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.

మేళా..
మలయాళ కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మేళా’. నితీష్‌ సహదేవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

మైసా
రష్మిక కీలక పాత్రలో రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మైసా’. దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం రష్మిక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆకాశంలో ఒక తార
దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా పవన్‌ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్నారు. శ్రుతిహాసన్‌, రుహాని శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా శ్రుతిహాసన్‌ పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

డిమాంటీ కాలనీ 3
‘డిమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘డిమాంటీ కాలనీ 3’. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. అరుళ్‌నితి, ప్రియా భవానీ శంకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement