కుబేర, కూలీ సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు చేసిన నాగార్జున.. చాన్నాళ్ల తర్వాత హీరోగా ఓ మూవీ చేస్తున్నారు. అదే 'కింగ్ 100'. తమిళ దర్శకుడు కార్తీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. వచ్చే నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో నాగ్‌తో పాటు టబు నటిస్తోందని ఇప్పటికే వెల్లడించారు. ఇప్పడు విలన్ పాత్రని ఓ యంగ్ హీరో చేస్తున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి చేసుకున్న హీరోయిన్)
తమిళంలో హీరోగా అడపాదడపా మూవీస్ చేస్తున్న అశోక్ సెల్వన్.. కింగ్ 100లో నటిస్తున్నాడని కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి.ఇందులో పోలీస్ పాత్ర పోషిస్తున్నట్లు దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ బట్టి అర్థమైంది. అయితే ఇతడిది విలన్ పాత్రనే అని తెలుస్తోంది. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. లాటరీ, గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ అని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: జాన్వీకి తెలుగులో ఛాన్స్‌లు రావని అర్థమైందా?)
Happy Birthday to the incredibly talented @AshokSelvan 💐 Welcome on board to #King100 your presence took our film to the next level🔥🔥🔥… couldn’t have asked for more💥 𝐈𝐍 𝐂𝐈𝐍𝐄𝐌𝐀𝐒 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟐𝟒𝐭𝐡, 𝟐𝟎𝟐𝟔. #HappyBirthdayAshokSelvan @ThisIsDSP @AshokSelvan @Rakarthik_dir @aishu_dil @sush_bhat94 @rajamahadhevan @NavinNooli @ArtSathees @CVRao74 @lemonsprasad #SupriyaYarlagadda @TSeriesSouth @AnnapurnaStdios
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 8, 2026


