వీకెండ్ వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తారు. వారమంతా హౌస్‌మేట్స్ చేసిన తప్పొప్పలని గురించి మాట్లాడతారు. ఈసారి అలానే వర్షిణి, ముకేశ్, దేబ్జానీ, త్రిగుణ్‌ని తిట్టారు. తప్పు చేసినందుకు నరేశ్‌ని షాకిచ్చారు. దీంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ బిగ్‌బాస్ 10 హౌస్‌లో 62వ రోజైన శనివారం(నవంబర్ 08) ఏం జరిగింది?
(ఇదీ చదవండి: పర్సనల్ వీడియో వైరల్.. నటి సురేఖావాణి సీరియస్)
వంశీ కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. వీకెండ్ కాబట్టి హోస్ట్ నాగార్జున ఎంట్రీతో శనివారం ఎపిసోడ్ మొదలైంది. కొత్త కెప్టెన్‌కి రెండు గోల్డ్ కాయిన్స్ రాగా వాటిని తలో రెండ రెండు రాంప్రసాద్, త్రిగుణ్‌కి వంశీ ఇచ్చేశాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో మాట్లాడిన నాగార్జున.. కెప్టెన్ అయినందుకు వంశీని అభినందించారు. వంశీ నామినేషన్స్ టైంలో 'కులుకుతారు' అనే పదం వాడినందుకు సుధీర్, వర్షిణితో మాట్లాడిన నాగ్.. వీడియో చూపించి మరీ తిట్టారు. ముకేశ్‌ని మగాడు కాదు, సాలా అన్న వీడియో చూపించి దేబ్జానీని నాగ్ తిట్టారు. ముకేశ్‌ని గేమ్‌లో కొట్టిన మరో వీడియో చూపించి తిట్టారు. కాఫీ గొడవ గురించి ముకేశ్‌ని తిట్టిన నాగార్జున.. అది దేబ్జానీ పర్సనల్ కాఫీ, ఆవిడ ఇష్టం అని అన్నారు. ఫుడ్ వేస్ట్ చేస్తుందని వర్షిణిని తిట్టారు. దేబ్జానీని టాస్క్‌లో కాలితో కొట్టడానికి ప్రయత్నించిన వీడియో చూపించి ముకేశ్‌ని తిట్టారు. నీతూ మాస్టర్ టాస్క్‌లో వంశీని కొట్టిన వీడియో చూపించి మాట్లాడారు. త్రిగుణ్ వివాదం గురించి మాట్లాడారు. త్రిగుణ్ ఏం అనకుండానే అన్నాడని ఓ మాట గురించి నీతూ గొడవ పెట్టుకున్న వీడియో చూపించి మరీ క్లారిటీ ఇచ్చారు.
నరేశ్ సంచాలక్‌గా చేసిన టాస్క్ గురించి మాట్లాడిన నాగ్.. టాస్క్‌లో అతడితే తప్పు అని నిరూపణ కావడం నరేశ్ ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్‌లో రారని క్లారిటీ ఇచ్చేసారు. ఓడిపోయిన రామకృష్ణ – అమన్‌లలో ఎవరి ఫ్యామిలీ రావాలో అడగ్గా నరేశ్.. అమన్ పేరు చెప్పాడు. తన ఫ్యామిలీ రాదని క్లారిటీ రావడంతో నరేశ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందరి మీద పాటలు పాడటం, నామినేషన్స్‌లో వర్షిణిని చీప్ క్యారెక్టర్ అన్న వీడియో చూపించి త్రిగుణ్‌ని తిట్టారు. మాటలు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. కెప్టెన్‌గా త్రిగుణ్ బాగా చేశాడనేవాళ్లు చేయి ఎత్తమంటే వంశీ తప్ప ఎవరు పైకెత్తలేదు. కానీ త్రిగుణ్ చేసినవన్నీ చెప్పి కెప్టెన్‌గా గుడ్ అని నాగ్ మెచ్చుకున్నారు.

అందరితో కూల్‌గా చెప్పి పనులు చేయించుకోవాలని త్రిగుణ్‌కి సలహా ఇచ్చిన నాగ్.. కూరగాయలు పాడవడం త్రిగుణ్ వల్ల కాదని వర్షిణికి కౌంటర్ ఇచ్చారు. నామినేషన్స్‌లోని వాళ్ళని పిలిచి ఒక టాస్క్ పెట్టిన నాగార్జున.. ఇందులో భాగంగా అమన్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడని తెలిపారు. రేపు వీకెండ్ ఎపిసోడ్, దీపావళి స్పెషల్ ఎపిసోడ్ రానుంది.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి చేసుకున్న హీరోయిన్)


