breaking news
Varshini Sounderajan
-
బిగ్‌బాస్ 10: ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్
వీకెండ్ అండే ఫన్ మోడ్ ఉంటుంది. అందుకు తగ్గట్లే హోస్ట్ నాగార్జున.. బిగ్‌బాస్ 10 హౌస్‌మేట్స్‌కి పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు. ఇక నరేశ్ కోసం హౌసులో ఉన్నోళ్లంతా త్యాగం చేయగా.. ముకేశ్ మీద వర్షిణి అలిగింది. ఇంతకీ 63వ రోజైన ఆదివారం(నవంబర్ 08) ఏం జరిగింది?(ఇదీ చదవండి: కుమారుడితో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్)దీపావళికి తోడు వీకెండ్ కలిసొచ్చింది. అలా ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. దేబ్జానీ, ముకేశ్ గొడవకు ఓ ముగింపు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే శివ్ తన చుట్టూ తిరుగుతున్నాడని ముకేశ్ అనడం నచ్చలేదని దేబ్జానీ చెప్పగా.. నల్ల కోతి అని శరీర రంగుని ఉద్దేశించి దేబ్జానీ అనడం తప్పు కదా అని ముకేశ్ అన్నాడు. దీంతో వీడియో ప్లే చేసి చూపించిన నాగ్. కావాలని దేబ్జానీ అనలేదు కానీ అనడం తప్పే. నువ్వు కూడ అలా అనడం తప్పే. ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోండని అన్నారు. తర్వాత ముకేశ్.. నామినేషన్ల నుంచి సేవ్ అయినట్లు ప్రకటించారు.నో పాజ్ ఓన్లీ ఆన్సర్ అనే టాస్క్ పెట్టగా అందులో ముకేశ్ జట్టు గెలుస్తుంది. తర్వాత నరేశ్, రాంప్రసాద్ సేఫ్ అయినట్లు నాగ్ చెప్పారు. బీబీ సినిమా అని మరో టాస్క్ పెడతాడు. ఇందులో భాగంగా ఒకరి గురించి మరొకరు చెప్పుకొన్నారు. ఇది పూర్తయిన తర్వాత వర్షిణి సేఫ్ అని నాగ్ చెప్పాడు. బ్రేక్ టైంలో నీతూ-రామకృష్ణ గొడవ పడ్డారు. నామినేషన్స్‌లో నేనే కనిపిస్తున్నా. ఇక్కడ కూడా నా ఫొటోనే పెట్టాలా? నేనే నీకు కనిపిస్తున్నానా? నీకు రక్త కన్నీరు అంటే ఏంటో చూపిస్తా అని రామకృష్ణని నీతూ బెదిరించింది. తర్వాత వచ్చిన నాగ్.. రామకృష్ణ, వర్షిణి, నరేశ్‌లకు ఫ్యామిలీ వీక్ రావడం లేదని, ఇంట్లోని సభ్యులు సపోర్ట్ చేస్తే ముగ్గురిలో ఒకరికి ఫ్యామిలీ వస్తుందని నాగ్ చెప్పగా.. అయితే దీనికోసం వాళ్లముందున్న దానిలో మీ వస్తువులు వేయాలి. వేసిన తర్వాత అవి తిరిగి రావని అన్నాడు. నరేశ్ కోసం అందరూ తమ వస్తువులు వేయగా, వర్షిణి కోసం ముకేశ్, ఆర్కే కోసం అమన్ మాత్రమే వేస్తారు. అలా హౌస్మేట్స్ త్యాగంతో నరేశ్, ఫ్యామిలీ వీక్కి ఎంపికయ్యాడు.నా కోసం నువ్వు వస్తువుల్ని త్యాగం చేయలేకపోయావ్.. నీ బట్టలన్నీ వేయొచ్చు కదా. అదే నేను ఉండుంటే, నా బట్టలన్నీ వేసేదాన్ని. వేరే వాళ్ల బట్టలతో అడ్జస్ట్ అయ్యేదాన్ని అని ముకేశ్ మీద వర్షిణి అలిగింది. చివరగా మిగిలిన నీతూ, శివ్, సుధీర్‌లలో ముందుగా శివ్ సేఫ్ అయ్యాడు. తర్వాత నీతూ సేవ్ అయింది. ఆపై సుధీర్ కూడా సేఫ్ అని నాగ్ చెప్పాడు. ఇదే చివరి వార్నింగ్ అని, ఇకపై జాగ్రత్తగా ఆడండి అని, దీపావళి స్పెషల్ నో ఎలిమినేషన్ అని నాగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. రాబోయే పదోవారం 'ఫ్యామిలీ టైం' థీమ్‌తో సాగుతుందని ప్రకటించాడు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: అమితాబ్.. ఈసారి భయపడలేదు) -
బిగ్‌బాస్ 10: నరేశ్‌ని ఏడిపించేసిన నాగార్జున
వీకెండ్ వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తారు. వారమంతా హౌస్మేట్స్ చేసిన తప్పొప్పలని గురించి మాట్లాడతారు. ఈసారి అలానే వర్షిణి, ముకేశ్, దేబ్జానీ, త్రిగుణ్‌ని తిట్టారు. తప్పు చేసినందుకు నరేశ్‌ని షాకిచ్చారు. దీంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ బిగ్‌బాస్ 10 హౌస్‌లో 62వ రోజైన శనివారం(నవంబర్ 08) ఏం జరిగింది?(ఇదీ చదవండి: పర్సనల్ వీడియో వైరల్.. నటి సురేఖావాణి సీరియస్)వంశీ కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. వీకెండ్ కాబట్టి హోస్ట్ నాగార్జున ఎంట్రీతో శనివారం ఎపిసోడ్ మొదలైంది. కొత్త కెప్టెన్‌కి రెండు గోల్డ్ కాయిన్స్ రాగా వాటిని తలో రెండ రెండు రాంప్రసాద్, త్రిగుణ్‌కి వంశీ ఇచ్చేశాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో మాట్లాడిన నాగార్జున.. కెప్టెన్ అయినందుకు వంశీని అభినందించారు. వంశీ నామినేషన్స్ టైంలో 'కులుకుతారు' అనే పదం వాడినందుకు సుధీర్, వర్షిణితో మాట్లాడిన నాగ్.. వీడియో చూపించి మరీ తిట్టారు. ముకేశ్‌ని మగాడు కాదు, సాలా అన్న వీడియో చూపించి దేబ్జానీని నాగ్ తిట్టారు. ముకేశ్‌ని గేమ్‌లో కొట్టిన మరో వీడియో చూపించి తిట్టారు. కాఫీ గొడవ గురించి ముకేశ్‌ని తిట్టిన నాగార్జున.. అది దేబ్జానీ పర్సనల్ కాఫీ, ఆవిడ ఇష్టం అని అన్నారు. ఫుడ్ వేస్ట్ చేస్తుందని వర్షిణిని తిట్టారు. దేబ్జానీని టాస్క్‌లో కాలితో కొట్టడానికి ప్రయత్నించిన వీడియో చూపించి ముకేశ్‌ని తిట్టారు. నీతూ మాస్టర్ టాస్క్‌లో వంశీని కొట్టిన వీడియో చూపించి మాట్లాడారు. త్రిగుణ్ వివాదం గురించి మాట్లాడారు. త్రిగుణ్ ఏం అనకుండానే అన్నాడని ఓ మాట గురించి నీతూ గొడవ పెట్టుకున్న వీడియో చూపించి మరీ క్లారిటీ ఇచ్చారు.నరేశ్ సంచాలక్‌గా చేసిన టాస్క్ గురించి మాట్లాడిన నాగ్.. టాస్క్‌లో అతడితే తప్పు అని నిరూపణ కావడం నరేశ్ ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్‌లో రారని క్లారిటీ ఇచ్చేసారు. ఓడిపోయిన రామకృష్ణ – అమన్లలో ఎవరి ఫ్యామిలీ రావాలో అడగ్గా నరేశ్.. అమన్ పేరు చెప్పాడు. తన ఫ్యామిలీ రాదని క్లారిటీ రావడంతో నరేశ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందరి మీద పాటలు పాడటం, నామినేషన్స్‌లో వర్షిణిని చీప్ క్యారెక్టర్ అన్న వీడియో చూపించి త్రిగుణ్‌ని తిట్టారు. మాటలు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. కెప్టెన్‌గా త్రిగుణ్ బాగా చేశాడనేవాళ్లు చేయి ఎత్తమంటే వంశీ తప్ప ఎవరు పైకెత్తలేదు. కానీ త్రిగుణ్ చేసినవన్నీ చెప్పి కెప్టెన్‌గా గుడ్ అని నాగ్ మెచ్చుకున్నారు.అందరితో కూల్‌గా చెప్పి పనులు చేయించుకోవాలని త్రిగుణ్‌కి సలహా ఇచ్చిన నాగ్.. కూరగాయలు పాడవడం త్రిగుణ్ వల్ల కాదని వర్షిణికి కౌంటర్ ఇచ్చారు. నామినేషన్స్‌లోని వాళ్ళని పిలిచి ఒక టాస్క్ పెట్టిన నాగార్జున.. ఇందులో భాగంగా అమన్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడని తెలిపారు. రేపు వీకెండ్ ఎపిసోడ్, దీపావళి స్పెషల్ ఎపిసోడ్ రానుంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి చేసుకున్న హీరోయిన్) -
బిగ్‌బాస్ 10: ముకేశ్ కోసం వర్షిణి త్యాగం.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
ప్రస్తుతం రివార్డ్-రివేంజ్ టాస్క్.. బిగ్‌బాస్ హౌస్‌లో నడుస్తోంది. దేబ్జానీ కారణంగా కుటుంబాన్ని కలుసుకునే ఛాన్స్ కోల్పోయిన ముకేశ్.. వర్షిణి త్యాగంతో తిరిగి ఆ అవకాశం దక్కించుకున్నాడు. అలానే కొత్త కెప్టెన్‌గా వంశీ ఎన్నికయ్యాడు. ఇంతకీ 10వ సీజన్లో 61వ రోజైన శుక్రవారం(నవంబర్ 06) ఏం జరిగింది?(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకుని 14 ఏళ్లు.. కానీ ఇప్పటికీ: రేణు దేశాయ్)రివార్డ్, రివెంజ్ టాస్క్‌ల్లో గెలిచిన వంశీ, శ్వేత, త్రిగుణ్, దేబ్జానీ.. ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. అలానే వచ్చేవారం తమ కుటుంబాలని కలుసుకునే అవకాశం దక్కించుకున్నారు. రివెంజ్‌కి గురవ్వని వాళ్ళు ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితే ఫ్యామిలీలని కలుసుకోవచ్చని చెప్పిన బిగ్‌బాస్.. రామకృష్ణ, వర్షిణి, అమన్, ముకేశ్‌కి మరో ఛాన్స్ ఇస్తా అందులో ఎవరు గెలిస్తే.. వాళ్ళు తమ కుటుంబాన్ని కలుసుకోవచ్చని చెప్పాడు.వీళ్ల నలుగురిని ఇద్దరిద్దరుగా గేమ్ ఆడమని చెప్పిన బిగ్‌బాస్.. గెలిచిన జంటలో ఒక్కరే ఫ్యామిలీని కలుసుకోగలరని క్లారిటీ ఇచ్చాడు. ఈ టాస్క్ లో వర్షిణి –ముకేశ్, అమన్ – నరేశ్ ఆడారు. ఇందులో వర్షిణి – ముకేశ్ గెలిచారు. వాళ్ళు సరిగ్గా ఆడలేదని అందరూ నరేశ్ సంచాలక్ కావడంతో అతడితో గొడవ పడ్డారు. మరోవైపు ఇద్దరిలో ఎవరో ఒకర్ని డిసైడ్ చేసుకోమనడంతో వర్షిణి త్యాగం చేసి ముకేశ్, అతడి కుటుంబాన్ని కలుసుకునే అవకాశం దక్కేలా చేసి ఏడ్చేసింది.చివరకు కెప్టెన్ డీజే టాస్క్ ఇచ్చారు. కంటెండర్స్ నలుగురు ఉంటారు. మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు మిగతా వాళ్ళు డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగాక ఫస్ట్ ఎవరు గంటని అందుకుంటారో వాళ్ళు ఒక దండ తీసుకొని కెప్టెన్ ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళ మెడలో దండ వేయాలి. కెప్టెన్సీ రేసులో త్రిగుణ్, వంశీ, శ్వేత, దేబ్జానీ ఉన్నారు. ఇంట్లో వాళ్ళకే కెప్టెన్ ఎంచుకునే ఛాన్స్ ఇచ్చారు. ఎక్కువ ఎవరికి దండలు పడతాయో వాళ్ళు కెప్టెన్ అవుతారు.(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ తప్పులు.. ‘రామాయణం’ నేర్చుకున్న పాఠాలు?) -
బిగ్‌బాస్ 10: వాళ్లిద్దరూ సేవ్ అయిపోయారు
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగానే మైండ్ గేమ్ కూడా కనిపించింది. అలా చివరకు సాగిన ఈ పోటీలో ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. ఇంతకీ ఎవరా ఇద్దరూ? 53వ రోజైన గురువారం(అక్టోబర్ 29) నాడు ఏం జరిగిందనేది చూద్దాం?(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' ట్విటర్ రివ్యూ)రోహిత్.. ముకేశ్ టీంలో కలిసిపోయాడు. నీకు స్టార్ ఇస్తా, వంశీని బీట్ చేసేలా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని వర్షిణితో రోహిత్ అన్నాడు. త్రిగుణ్‌తో డీల్స్ పెట్టుకుంటే నీకు సపోర్ట్ చేయనని కండీషన్ పెట్టాడు. మరోవైపు రెండు వేలకు తన స్టార్‌ని అమన్‌కి రోహిత్ ఇచ్చేశాడు. శివ, రాంప్రసాద్ దగ్గరకు వెళ్లి వర్షిణి గురించి మాట్లాడాడు. ముకేశ్.. వర్షిణిని గ్రీన్‌లోకి తేవాలని రోహిత్‌ని ఎల్లోలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని శివ్ చెప్పాడు. ఆ రెండూ జరగవని రాంప్రసాద్ అన్నాడు. మీరే గ్రీన్‌లోకి రావాలి, వర్షిణి గ్రీన్‌లోకి రోహిత్ ఎల్లోలోకి రావడానికి వీల్లేదన్నాడు.బీబీ హోటల్ టాస్క్ అలా సాగుతుండగానే బిగ్‌బాస్.. ఒక పాము-నిచ్చెన ఛాలెంజ్ ఇచ్చాడు. ఇది ఆడటానికి ఒక ఓనర్, ఇద్దరు వర్కర్స్ ఉండేలా రెండు టీమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. గెస్టులందరూ డైస్ రోల్ చేసే ప్లేయర్స్‌గా పాల్గొనాలి. డైస్ రోల్ చేసినప్పుడు ఏ నంబర్ వస్తుందో, అదే నంబర్ పెద్ద డైస్పైకి తీసుకురావాలి. అందుకోసం పెద్ద డైస్ లోపల ఉన్న ఓనర్స్ దాన్ని లోపలి నుంచి తోస్తూ సరైన నంబర్ పైకి వచ్చేలా చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ గేమ్‌లో శివ్ తరఫున పిక్కలలా రామకృష్ణ (బ్లూ), శ్వేత (గ్రీన్) ఆడితే రాంప్రసాద్ తరఫున వంశీ (ఎల్లో), సుధీర్ (రెడ్) కలర్ పిక్కలలా ఆడారు. ఈ టాస్క్‌లో రాంప్రసాద్ గెలిచాడు. ఇతడికి డబ్బులు స్టార్ రావడంతో స్టార్ తీసుకొని శివ్‌కి డబ్బులు ఇచ్చాడు.ఇంటి సభ్యులకు ఫైనల్ డీలింగ్ చేసుకోమని బిగ్‌బాస్ చెప్పగా... నాకు వాళ్ల మీద నెగిటివ్ వస్తుంది అందుకే మీకు స్టార్ ఇస్తున్నాని శివ్, రాంప్రసాద్‌తో అన్నాడు. అమన్ కూడా రాంప్రసాద్‌కి స్టార్ ఇచ్చాడు. చివరగా ఎవరి దగ్గర ఎంత క్యాష్, స్టార్స్ ఉన్నాయో చెప్పమని బిగ్‌బాస్ అడగ్గా.. వంశీ తన దగ్గర రూ.45 వేలు ఉందని చెప్పాడు. శ్వేత దగ్గర జీరో క్యాష్, జీరో స్టార్స్.. రామకృష్ణ దగ్గర రూ.300 క్యాష్.. సుధీర్ దగ్గర జీరో క్యాష్.. రోహిత్ దగ్గర జీరో స్టార్స్ రూ.30,500 క్యాష్.. వర్షిణి దగ్గర మూడు పింక్ స్టార్స్, ఒక గోల్డ్ స్టార్.. శివ్ దగ్గర జీరో స్టార్స్.. రాంప్రసాద్ దగ్గర ఏకంగా ఏడు పింక్ స్టార్స్, ఒక గోల్డ్ స్టార్ ఉన్నాయని చెప్పారు.స్టార్స్ ఉన్న ఇద్దరు సభ్యులు రాంప్రసాద్, వర్షిణి ఎల్లో లెవెల్ నుంచి గ్రీన్ లెవెల్‌కు చేరుకొని గోట్స్ అయ్యారు. తద్వారా నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. వంశీ రెడ్ నుంచి ఎల్లో లెవల్‌కి వచ్చాడు. అలా గురువారం ఎపిసోడ్ పెద్దగా మెరుపుల్లేకుండానే పూర్తయింది. ఇక రోహిత్ మిగతా గొడవల్లో తప్పితే ఈ గేమ్‌లో పెద్దగా మెప్పించలేకపోయాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు) -
బిగ్‌బాస్ 10: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?
ఎనిమిదో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. గతవారం జరిగిన టాస్క్‌ల్లో గెలిచి గ్రీన్‌లోకి వెళ్లిన గోట్స్కి రెండు వారాలు సేవ్ అయ్యే అవకాశం దొరికింది. దీంతో మిగిలిన వాళ్లలో వాళ్లే నామినేట్ చేసుకున్నారు. అలా ఈసారి మొత్తం ఎనిమిది మంది లిస్టులోకి వచ్చారు. ఇంతకీ బిగ్‌బాస్ 10లో 51వ రోజైన మంగళవారం(అక్టోబర్ 27) అసలేం జరిగింది? అనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)నిన్న గ్రీన్ కేటగిరీలోని గోట్స్ నామినేషన్స్ చేశారు. అయితే త్రిగుణ్.. వర్షిణిని నామినేట్ చేయడం గురించి ఇద్దరూ బాధపడ్డారు. దీని గురించి చర్చించుకున్నారు. వర్షిణి మాట్లాడుతూ ఇదేనా నువ్వు , నాకు తెలిసిన త్రిగుణ్.. నువ్వు కాదు అని చెప్పింది. అర్ధం చేసుకోవా వర్షిణి అని త్రిగుణ్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. త్రిగుణ్ ఏడుస్తుంటే రోహిత్ ఫుల్‌గా నవ్వుకున్నాడు. మరోవైపు గోట్లో జరిగిన వెయిట్స్ గేమ్ గురించి అందులో ఎవరెవరు ఎలా ఆడారో నరేశ్, రాంప్రసాద్ కామెడీ స్కిట్ చేసి అందరినీ చాలా నవ్వించారు. తర్వాత నామినేషన్స్ ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మళ్లీ మొదలైంది. గ్రీన్‌లోని గోట్స్ జడ్జిలుగా ఉండగా.. తొలుత ఎల్లో లెవల్లో ఉన్నవాళ్లలో ముగ్గురికి నామినేషన్ వేసే అవకాశం దక్కింది. ఎవరు నామినేషన్ వేయాలి అని గ్రీన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎల్లో వాళ్ళు ఇద్దర్ని నామినేట్ చేయాలి. వాళ్ళు చెప్పిన కారణాలు విని గ్రీన్ జడ్జిలు ఒకటి ఫైనల్ చేయాలి.తొలుత వచ్చిన నరేశ్.. ఝాన్సీ, వర్షిణిలని నామినేట్ చేశాడు. వర్షిణి గేమ్స్ ఆడట్లేదు. తొందరగా గివ్-అప్ ఇచ్చేస్తుందని కారణాలు చెప్పాడు. దీంతో నాకు సర్జరీ అయిందని వర్షిణి వివరణ ఇచ్చుకుంది. ఎక్కువ ఏడుస్తున్నావు, బాగా ఆడాలని అనుకోవట్లేదని చెప్పి నామినేషన్ చేశాడు. జడ్జిలు వర్షిణిని ఫైనల్ చేశారు. తర్వాత వచ్చిన శివ్.. సుధీర్, వంశీలని నామినేట్ చేశాడు. వంశీ గురించి మాట్లాడుతూ ముకేశ్ గతంలో చేసిన నామినేషన్స్ ఉదాహరణగా చెప్తుంటే ముకేశ్ వచ్చి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. కట్ చేస్తే సుధీర్ నామినేషన్‌ని జడ్జిలు ఫైనల్ చేశారు. తర్వాత రాంప్రసాద్ వచ్చాడు. ఇతడు శివ్, శ్వేతలని నామినేట్ చేశాడు. వీళ్లని శివ్ని నామినేట్ చేస్తున్నట్లు జడ్జిలు వెల్లడించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: డబుల్ ఎలిమినేషన్.. రెమ్యునరేషన్ ఎంతిచ్చారు?)అనంతరం రెడ్ టీమ్‌లో ఉన్నవాళ్లకు ఒకరినే నామినేట్ చేసే అవకాశం లభించింది. అందులో ఎవరో ఒకరిని గ్రీన్ జడ్జిలు ఫైనల్ చేయాలి. తొలుత రోహిత్, రామకృష్ణలని పిలిచారు. రోహిత్.. నరేశ్‌ని, రామకృష్ణ.. వర్షిణిని నామినేట్ చేశాడు. రామకృష్ణ వర్షిణిని చేసిన నామినేషన్‌ని జడ్జిలు ఓకే చేశారు. తర్వాత ఝాన్సీ, శ్వేత వచ్చారు. వరసగా శివ్, ఝాన్సీని నామినేట్ చేశారు. వీరిలో శ్వేత.. ఝాన్సీని చేసిన నామినేషన్ ఫైనల్ చేశారు.ఇలా ఈ రెండు రోజులు జరిగిన నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత చివరగా ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రాంప్రసాద్, వర్షిణి, శివ్ నామినేషన్స్‌లో నిలిచారు. శ్వేత, నరేశ్, వంశీ ఈ లిస్టులో లేరు. వీరిలో ఎవరో ఒకరిని గ్రీన్‌లోని గోట్స్ నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పడంతో వంశీ పేరు చెప్పారు. మొత్తంగా ఈ వారం ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రాంప్రసాద్, వర్షిణి, శివ్, వంశీ నామినేట్ అయ్యారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: రోహిత్‌తో నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉన్నావా? షాలినికి ఇచ్చిపడేసిన శివాజీ)(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాజమౌళి కొడుకు సినిమా.. అధికారిక ప్రకటన) -
బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో నాలుగో వారం సృష్టి ఎలిమినేట్ అయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక సోమవారం రావడంతో ఎప్పటిలానే నామినేషన్ల హడావుడి నడిచింది. ఈసారి కామనర్ అపూర్వ రెచ్చిపోయింది. ప్రోమో అంతా దాదాపుగా ఈమెనే కనిపించింది. వర్ణిణి, ముకేశ్‌లతో గొడవలు పెట్టుకుంది. ఇంతకీ ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? ప్రోమోలో ఏముంది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: సృష్టి ఎలిమినేట్.. నాలుగు వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే?)ఈసారి నామినేషన్ల ప్రక్రియ కోసం 'రోడ్ టూ రీలోడ్' అనే కాన్సెప్ట్‌ని బిగ్‌బాస్ పెట్టాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్‌లో ఒకరు ఓ పండుని తీసుకుని ఎదురుగా ఉన్న బాక్సుల్లో ఏదో ఒకదాని దిగువన దాస్తారు. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు హౌస్మేట్స్.. దాన్ని వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే అది మొదటగా దొరుకుతుందో వాళ్లకు నామినేట్ చేసే అవకాశం దక్కుతుంది.ప్రోమోలో చూపించినట్లు రాంప్రసాద్.. అమన్‌ని, ముకేశ్.. అపూర్వని, త్రిగుణ్ కూడా అపూర్వనే నామినేట్ చేశాడు. మొత్తంగా చూస్తే ఈసారి నామినేషన్ ప్రక్రియ మంచి హుషారుగా గొడవలు, కొట్లాటలతో రంజుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలా ఐదోవారానికిగానూ త్రిగుణ్, అమన్, రోహిత్, శాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. అలానే ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే అవకాశముంది. దీంతో డబుల్ ఎలిమినేషన్ షాక్ గ్యారంటీ అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఎవరూ నాకు ఏ ఆస్తి బహుమతిగా ఇవ్వలేదు.. రకుల్ ప్రీత్ సీరియస్) -
బిగ్‌బాస్ 10: అమన్‌కి అన్యాయం.. వర్షిణి దెబ్బకు మైండ్ బ్లాక్
నోటివరకు వచ్చిన కూడు అందకుండాపోతే ఆ బాధ వర్ణనాతీతం. బిగ్‌బాస్ హౌస్‌లో అమన్ విషయంలో సరిగ్గా ఇదే సీన్ రిపీటైంది. కష్టపడి కెప్టెన్ అయితే వర్షిణి దాన్ని ఎగరేసుకుపోయింది. మరోవైపు ఆరోవారం ఇమ్యూనిటీ కోసం ఆ ఇద్దరూ గెలిచారు. ఇంతకీ శుక్రవారం(అక్టోబర్ 02) ఎపిసోడ్లో అసలేం జరిగింది? అనేది హైలైట్స్‌లో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)గురువారం నాడు బిగ్‌బాస్ 10 హౌస్‌లోని రెండు టీమ్స్ మధ్య టాస్క్‌లు జరిగి భైరవ టీమ్(రెడ్ టీమ్) కెప్టెన్సీ టాస్క్‌లకు అర్హత సాధించింది. ఆరోవారం వరకు ఎవరి దగ్గర మూడు కత్తులు ఉంటే వాళ్లకు ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి అందరి మధ్య కత్తులు(డాగర్స్) గురించి డిస్కషన్ జరిగింది. మరోవైపు బిగ్‌బాస్ భైరవ టీమ్‌లో ఎవరైనా ఐదుగురు మాత్రమే కెప్టెన్సీ పోరులో పాల్గొనాలని చెప్పాడు. అమన్ కెప్టెన్ అవుతానంటే రోహిత్ వద్దన్నాడు. చాలాసేపు గొడవలు, డిస్కషన్స్ జరిగిన తర్వాత వర్షిణి, ఝాన్సీ, రాంప్రసాద్, అపూర్వ, అమన్.. కెప్టెన్సీ పోటీలకు సిద్ధమయ్యారు.కెప్టెన్సీ కోసం 'పాత్ టూ పవర్' అనే పోటీని మూడు లెవల్స్‌లో పెట్టారు. చివరవరకు ఎవరు నిలిస్తే వాళ్లు కెప్టెన్ అవుతారు. ఒక కర్రతో పోల్స్‌కి వేలాడుతున్న బ్యాగ్స్‌ని కిందకు పడేసి అందులోని తాడులు తీసుకొని ఎదురుగానున్న డబ్బాలపై తాడుతో బ్రిడ్జ్ తయారుచేయాలి. ముందుగా వచ్చే ముగ్గురు తర్వాత దశకి వెళ్తారు. రెండో లెవల్లో తాడుపై బాల్స్ కదిలించి చేసే టాస్క్. అందులో ముందు చేసిన ఇద్దరు తర్వాత దశకి వెళ్తారు. చివరి లెవల్లో బిగ్‌బాస్ ముక్కలతో ఐ లోగో పూర్తిచేయాలి. ఎవరు మొదటగా చేస్తే వాళ్లు కెప్టెన్ అవుతారు.(ఇదీ చదవండి: 'తెల్లకాగితం' సినిమా రివ్యూ)అయితే ఈ గేమ్ అంతా ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగానే సాగింది. మొదటి దశలో అమన్, రాంప్రసాద్, ఝాన్సీ గెలవగా నెక్స్ట్ లెవల్‌కి అమన్, ఝాన్సీ వెళ్లారు. ఫైనల్‌గా అమన్ గెలిచాడు. కెప్టెన్ అయ్యాడు. ఝాన్సీ ఓడిపోయినందుకు ఏడ్చింది. అయితే వర్షిణి తన మ్యాజికల్ పవర్ వాడతానని బిగ్‌బాస్‌ని అడగ్గా ఓకే చెప్పి ఆమె తాళాలు పంపించాడు. వర్షిణి మ్యాజిక్ పవర్ ఏంటంటే ఎవరు గెలిస్తే వాళ్ల దగ్గరున్న శక్తిని తీసేసుకోవచ్చు. దీంతో వర్షిణి అమన్ కెప్టెన్సీ తీసుకుంది. ఇక కెప్టెన్ అయినందుకు ముకేశ్ కాళ్లు పట్టుకొని తనని ఆశీర్వదించమంది. ఇక డాగార్లు(కత్తులు) ఉన్నవాళ్లకే ఇమ్యూనిటీ ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశముందని బిగ్‌బాస్ చెప్పాడు. తర్వాత ఇమ్యూనిటీ గేమ్ పెట్టాడు. డాగార్లు ఉన్నోళ్ల ఫొటోలు ముందు పెట్టి రెండు లేదా ఎక్కువ డాగర్స్ ఉన్నవాళ్లు ఎవరు ఇమ్యూనిటీ ఇవ్వాలో నిర్ణయిస్తారని చెప్పాడు. దానికి ఓ టాస్క్ పెట్టాడు. మొదట సృష్టి.. వంశీ ఫోటో తీసేసి తన ఫొటో పెడతానంది. సుధీర్.. సృష్టి ఫొటో తీసేసాడు. ఝాన్సీ త్రిగున్ ఇమ్యూనిటీ తీసేసుకుంది. వంశీ.. చరణ్ ఇమ్యూనిటీ తీసుకున్నాడు. దీంతో ఫైనల్‌గా వంశీ, సుధీర్.. ఆరో వారానికి ఇమ్యూనిటీ పొందారు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ బుగ్గ గిల్లిన అభిమాని.. వీడియో వైరల్) -
బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్లో ట్విస్టులు
వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వచ్చిన మిథిలేష్.. షాక్ ఇచ్చి రూ.15 లక్షలు తీసుకెళ్లిపోవడం హాట్ టాపిక్ అయిపోయింది. అయితే ఇతడు డబ్బులు తీసుకెళ్లిపోవడం మటేమో గానీ హౌస్‌లో రచ్చ రచ్చ అయిపోయింది. ఆదివారం(సెప్టెంబరు 27) ఎపిసోడ్లో అందరి రంగులు బయటపడ్డాయి. అలానే ఎలిమినేషన్ విషయంలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఇంతకీ బిగ్‌బాస్ 10వ సీజన్లో 21వ రోజు అసలేం జరిగింది?(ఇదీ చదవండి: వినాయక చవితి వల్ల ఇబ్బంది.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అల్లు శిరీష్)మిథిలేష్.. విజేత ప్రైజ్‌మనీలో నుంచి రూ.15 లక్షలు తీసుకుని బయటకెళ్లిపోవడం గురించి డిస్కషన్‌తో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. హౌస్‌లోని సగం మంది ఇది తప్పునగా.. అగ్నిపరీక్ష బ్యాచ్ అది మిథిలేష్ ఇష్టం అని అన్నారు. విన్నర్ ప్రైజ్‌మనీ ఎందుకు ఇవ్వాలి? అని ముకేశ్, వంశీ, త్రిగుణ్, దేబ్జానీ ఫైర్ అయ్యారు. మిథిలేష్‌కి సపోర్ట్ చేసిన వాళ్లందరినీ ముకేశ్, త్రిగుణ్ పిచ్చ తిట్లు తిట్లు తిట్టారు. చివరికి అమన్ కూడా సపోర్ట్ చేయడంతో అందరూ అమన్‌ని తిట్టారు. అమన్ – త్రిగుణ్ కొట్టుకునేంత వరకు వెళ్లారు.రూ.15 లక్షలు తీసుకుని స్టేజీకి పైకి వెళ్లిన మిథిలేష్‌ని.. వెళ్లేముందు ఒక ఐదుగురిని ఎవరి గురించి జాగ్రత్తపడాలో చెప్పమని హోస్ట్ నాగార్జున అడిగాడు. దీంతో అమన్.. రోహిత్‌తో, వర్షిణి.. ముకేశ్‌తో, వంశీ.. త్రిగుణ్‌తో, నరేష్.. రాంప్రసాద్‌తో, చరణ్.. షాలినితో జాగ్రత్త పడాలని మిథిలేష్ చెప్పాడు. తర్వాత జంగిల్ గేమ్ ఆడించారు. ఒక్కో జంతువుకి తగిలించిన గుణాన్ని ఒక్కో కంటెస్టెంట్ ఇచ్చి ఎందుకో కారణం చెప్పాలని టాస్క్ పెట్టారు.(ఇదీ చదవండి: తెలుగు యువ దర్శకుడి భార్య మృతి.. అవయవదానం)ఇందులో భాగంగా ముకేశ్.. చిలుక మెడల్ తీసుకుని అమన్‌కి ఇచ్చాడు. నిర్ణయాలు సరిగ్గా తీసుకోవట్లేదు. వేరేవాళ్లు చెప్పినవి వింటాడు అని కారణాలు చెప్పాడు. రాంప్రసాద్.. నెమలి మెడల్ తీసుకొని షాలినికి ఇచ్చి షో అఫ్, ఓవరాయాక్షన్ చేస్తుందని చెప్పాడు. షాలిని.. పాము మెడల్ తీసుకొని అపూర్వకి ఇచ్చి పాత గొడవలు ఉన్నాయని చెప్పింది. నరేష్.. పాండా మెడల్ తీసుకొని బద్దకం అని దేబ్జానీకి ఇచ్చాడు. అపూర్వ.. పాము మెడల్ తీసుకొని పాయిజన్నెస్ అని త్రిగుణ్‌కి ఇచ్చింది. ఇలా ఈ టాస్క్ సాగింది. తర్వాత 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీ ప్రమోషన్స్ కోసం ఫహాద్ ఫాజిల్ షోకి వచ్చాడు. ఇక రోహిత్‌కి మేనల్లుడు పుట్టాడని ఆ బాబు ఫోటో చూపించడంతో తెగ ఎమోషనల్ అయిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు.నామినేషన్స్‌లో ఒక్కొక్కరు బతికిపోతూ చివరకు వంశీ, వర్షిణి మిగిలారు. అయితే టెంప్టేషన్ వీక్ కాబట్టి కెప్టెన్ ముకేశ్‌కి హోస్ట్ నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. నువ్వు వాళ్లని కాపాడొచ్చు కానీ నీ ఇమ్యూనిటీ, కెప్టెన్సీ పోతుంది. వచ్చేవారం నువ్వు డైరెక్ట్ నామినేషన్స్‌లో ఉంటావ్. ఇవి ఒప్పుకుంటే ఇద్దరు ఎలిమినేట్ అవ్వకుండా హౌస్‌లో ఉంటారని కండీషన్ పెట్టడంతో ముకేశ్ వాటన్నింటికీ ఒప్పుకొన్నాడు. దీంతో వర్షిణి, వంశీ ఎలిమినేట్ కాకుండా బతికిపోయారు. ముకేశ్‌తో కలిసి టాస్క్ గెలిచింది కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన అపూర్వ కొత్త కెప్టెన్ అయిపోయింది. వచ్చిన రెండు రోజుల్లోనే కెప్టెన్ అయి రికార్డ్ సృష్టించింది. నాలుగోవారం టోటల్ డామినేషన్ అవతారంలో టాస్క్‌లు జరగనున్నాయని చెప్పి ఆదివారం ఎపిసోడ్ ముగించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన) -
FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?
-
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)
-
నటిగా మొదలుపెట్టి యాంకర్‌గా ఫేమస్ అయి.. ఎట్టకేలకు 'బిగ్‌బాస్'లోకి..
ప్రతిసారి 'బిగ్‌బాస్'లోకి గ్లామరస్ యాంకర్స్‌ని తీసుకొస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాతో హౌస్‌లోకి వచ్చిన బ్యూటీ వర్షిణి. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈమె పేరు వినిపించేది. కానీ చివరలో తూచ్ ఈమె లేదని తేలేది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇకపోతే వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్‌లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్‌బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్‌తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్‌తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి?


