బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్‌లో ట్విస్టులు | Bigg Boss 10 Telugu Day 21, Sep 27th 2026 Full Episode Highlights, Mithilesh ₹15 Lakh Exit Sparks Explosive Drama In House | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 10 Day 21: వెక్కివెక్కి ఏడ్చిన రోహిత్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?

Sep 28 2026 9:44 AM | Updated on Sep 28 2026 10:15 AM

Bigg Boss Telugu 10 Day 21 Episode Highlights

వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వచ్చిన మిథిలేష్.. షాక్ ఇచ్చి రూ.15 లక్షలు తీసుకెళ్లిపోవడం హాట్ టాపిక్ అయిపోయింది. అయితే ఇతడు డబ్బులు తీసుకెళ్లిపోవడం మటేమో గానీ హౌస్‌లో రచ్చ రచ్చ అయిపోయింది. ఆదివారం(సెప్టెంబరు 27) ఎపిసోడ్‌లో అందరి రంగులు బయటపడ్డాయి. అలానే ఎలిమినేషన్ విషయంలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఇంతకీ బిగ్‌బాస్ 10వ సీజన్‌లో 21వ రోజు అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: వినాయక చవితి వల్ల ఇబ్బంది.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అల్లు శిరీష్)

మిథిలేష్.. విజేత ప్రైజ్‌మనీలో నుంచి రూ.15 లక్షలు తీసుకుని బయటకెళ్లిపోవడం గురించి డిస్కషన్‌తో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. హౌస్‌లోని సగం మంది ఇది తప్పునగా.. అగ్నిపరీక్ష బ్యాచ్ అది మిథిలేష్ ఇష్టం అని అన్నారు. విన్నర్ ప్రైజ్‌మనీ ఎందుకు ఇవ్వాలి? అని ముకేశ్, వంశీ, త్రిగుణ్, దేబ్జానీ ఫైర్ అయ్యారు. మిథిలేష్‌కి సపోర్ట్ చేసిన వాళ్లందరినీ ముకేశ్, త్రిగుణ్ పిచ్చ తిట్లు తిట్లు తిట్టారు. చివరికి అమన్ కూడా సపోర్ట్ చేయడంతో అందరూ అమన్‌ని తిట్టారు. అమన్ – త్రిగుణ్ కొట్టుకునేంత వరకు వెళ్లారు.

రూ.15 లక్షలు తీసుకుని స్టేజీకి పైకి వెళ్లిన మిథిలేష్‌ని.. వెళ్లేముందు ఒక ఐదుగురిని ఎవరి గురించి జాగ్రత్తపడాలో చెప్పమని హోస్ట్ నాగార్జున అడిగాడు. దీంతో అమన్.. రోహిత్‌తో, వర్షిణి.. ముకేశ్‌తో, వంశీ.. త్రిగుణ్‌తో, నరేష్.. రాంప్రసాద్‌తో, చరణ్.. షాలినితో జాగ్రత్త పడాలని మిథిలేష్ చెప్పాడు. తర్వాత జంగిల్ గేమ్ ఆడించారు. ఒక్కో జంతువుకి తగిలించిన గుణాన్ని ఒక్కో కంటెస్టెంట్ ఇచ్చి ఎందుకో కారణం చెప్పాలని టాస్క్ పెట్టారు.

(ఇదీ చదవండి: తెలుగు యువ దర్శకుడి భార్య మృతి.. అవయవదానం)

ఇందులో భాగంగా ముకేశ్.. చిలుక మెడల్ తీసుకుని అమన్‌కి ఇచ్చాడు. నిర్ణయాలు సరిగ్గా తీసుకోవట్లేదు. వేరేవాళ్లు చెప్పినవి వింటాడు అని కారణాలు చెప్పాడు. రాంప్రసాద్.. నెమలి మెడల్ తీసుకొని షాలినికి ఇచ్చి షో అఫ్, ఓవరాయాక్షన్ చేస్తుందని చెప్పాడు. షాలిని.. పాము మెడల్ తీసుకొని అపూర్వకి ఇచ్చి పాత గొడవలు ఉన్నాయని చెప్పింది. నరేష్.. పాండా మెడల్ తీసుకొని బద్దకం అని దేబ్జానీకి ఇచ్చాడు. అపూర్వ.. పాము మెడల్ తీసుకొని పాయిజన్‌నెస్ అని త్రిగుణ్‌కి ఇచ్చింది. ఇలా ఈ టాస్క్ సాగింది. తర్వాత 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీ ప్రమోషన్స్ కోసం ఫహాద్ ఫాజిల్ షోకి వచ్చాడు. ఇక రోహిత్‌కి మేనల్లుడు పుట్టాడని ఆ బాబు ఫోటో చూపించడంతో తెగ ఎమోషనల్ అయిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు.

నామినేషన్స్‌లో ఒక్కొక్కరు బతికిపోతూ చివరకు వంశీ, వర్షిణి మిగిలారు. అయితే టెంప్టేషన్ వీక్ కాబట్టి కెప్టెన్ ముకేశ్‌కి హోస్ట్ నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. నువ్వు వాళ్లని కాపాడొచ్చు కానీ నీ ఇమ్యూనిటీ, కెప్టెన్సీ పోతుంది. వచ్చేవారం నువ్వు డైరెక్ట్ నామినేషన్స్‌లో ఉంటావ్. ఇవి ఒప్పుకుంటే ఇద్దరు ఎలిమినేట్ అవ్వకుండా హౌస్‌లో ఉంటారని కండీషన్ పెట్టడంతో ముకేశ్ వాటన్నింటికీ ఒప్పుకొన్నాడు. దీంతో వర్షిణి, వంశీ ఎలిమినేట్ కాకుండా బతికిపోయారు. ముకేశ్‌తో కలిసి టాస్క్ గెలిచింది కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన అపూర్వ కొత్త కెప్టెన్ అయిపోయింది. వచ్చిన రెండు రోజుల్లోనే కెప్టెన్ అయి రికార్డ్ సృష్టించింది. నాలుగోవారం టోటల్ డామినేషన్ అవతారంలో టాస్క్‌లు జరగనున్నాయని చెప్పి ఆదివారం ఎపిసోడ్ ముగించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement