‘నరేశ్‌.. రాంప్రసాద్‌తో జాగ్రత్త.. లేదంటే నీ పని అంతే..!’ | Bigg Boss 10 Telugu Day 21 Promos | Sakshi
Sakshi News home page

Bigg boss 10 promo: త్రిగుణ్‌ని నమ్మే సమస్యే లేదు. అతను ఒక..

Sep 27 2026 3:35 PM | Updated on Sep 27 2026 4:05 PM

Bigg Boss 10 Telugu Day 21 Promos

  వైల్డ్ కార్డ్‌గా ఇంట్లోకి వచ్చి రెండు రోజులే అయిన మిథిలేష్ 15 లక్షలు సొంతం చేసుకుని బయటకు వెళ్లాడు. వచ్చిన రెండు రోజులకే 15లక్షలు ఇవ్వడానికి అసలు సిగ్గు లేకుండా ఓట్లు ఎలా వేస్తారు అని త్రిగుణ్అందరిపై ఫైర్‌ అయ్యాడు. డబ్బులు తీసుకుంటోంది ప్రొడక్షన్ నుంచి విన్నర్ డబ్బుల్లోంచి.. అని అమన్ ‌తో ముఖేష్ అంటాడు. అది నా డబ్బు అని త్రిగుణ్ అంటే. నాది కాదా? అని అమన్ అంటాడు. మరి ఎందుకు ఇచ్చావ్.. అంత ఇవ్వాలనిపిస్తే.. గెలిచిన తర్వాత బయటకు వెళ్లి ఇవ్వాల్సి కదా అంటూ ఫైర్‌ త్రిగుణ్‌ ఫైర్‌ అవుతాడు. 

ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కోలా ఉంటుంది.. మిథిలేష్‌కి అలా..  నాకు ఇలా చేయాలని అనిపించింది అని అమన్‌ అన్నాడు.  అయితే సరే మూసుకుని ఉండు అని త్రిగుణ్ అనడంతో. నువ్వు కూడా మూసుకుని ఉండు.. చేతకాకపోతే పడుకోపో అని అమన్ అనడంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తీరాస్థాయికి చేరుకుంటుంది.

 బిగ్ బాస్ ఇంట్లోంచి..
 బిగ్ బాస్ ఇంట్లోంచి మిథిలేష్ బయటకు వచ్చేశారు. అయితే తాజాగా వచ్చిన ప్రోమోని చూస్తే ‘మనుషులున్నారు. జాగ్రత్త..’ అనే టాస్క్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. ఇందులో మిథిలేష్‌ కంటెస్టెంట్లకు మంచి మంచి సలహాలు ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. రోహిత్‌ నుంచి అమన్‌, త్రిగుణ్‌ నుంచి వంశీ, ముఖేష్‌ నుంచి వర్షిణీ, రాంప్రసాద్‌ నుంచి నరేష్‌లను జాగ్రతగా ఉండమని సూచించాడు. ఇది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే వీళ్లందరి మాట పక్కన పెడితే.. రాంప్రసాద్‌, నరేశ్‌లు మంచి స్నేహితులు. వీరు ఇప్పుడు ఎలా ఆడుతారనేది ఆసక్తిని పెంచుతోంది.

మరో ప్రోమో3,4 ని పరిశీలిస్తే..
మరో ప్రోమో3,4 ని పరిశీలిస్తే.. బీబీ జంగల్‌ టాస్క్‌ను బిగ్‌బాస్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.  అందులో కింద ఉన్న మెడల్‌ను ఎవరికిస్తావని త్రిగుణ్‌ని అడగగానే అమన్‌కి ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.  ఇదే టాస్క్‌లో రోహిత్‌.. త్రిగుణ్‌ని నమ్మే సమస్యేలేదని తేల్చి చెప్పడంతో  ఈరోజు ఎపిసోడ్‌ ఎలా సాగుతుందని ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు రోహిత్‌ మాటతీరుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ చిత్ర బృందం బిగ్‌బాస్‌లో సందడి చేసింది.  అంతేకాకుండా కంటెస్టెంట్లకు టాస్క్‌లు ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఈ రోజు ఏం జరగబోతోంది అనేది తెలియాలి అంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే.
 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement