బిగ్‌బాస్‌ చరిత్రలోనే భారీ రెమ్యునరేషన్‌..! రోజుకు రూ.7లక్షల పైమాటే.. | Biggboss Mithilesh Earns Rs 15 Lakh in Just 2 Days Bigg Boss Exit Deal Sparks Buzz | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ చరిత్రలోనే భారీ రెమ్యునరేషన్‌..! ఇది ఆ సెలబ్రిటీల కంటే ఎక్కువ..

Sep 27 2026 2:39 PM | Updated on Sep 27 2026 3:30 PM

Biggboss Mithilesh Earns Rs 15 Lakh in Just 2 Days Bigg Boss Exit Deal Sparks Buzz

బిగ్‌బాస్‌.. రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. హౌస్‌లో ఎవరి ప్లాన్‌తో వాళ్లు కొత్త పంజాలనే విసురుతున్నారు. ఆట శైతం రసవత్తరంగా మారుతోంది. అయితే ఇప్పుడు వాళ్ల రెమ్యునరేషన్‌పై ప్రేక్షకుల కన్ను పడింది. దీంతో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో సెలబ్రిటీలతో పాటు కామనర్ల రెమ్యునరేషన్‌పై కూడా ఆసక్తి నెలకొంది. ఈ సీజన్‌లో కామనర్లకు వారానికి సుమారు రూ.70 వేల వరకు పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా కామనర్‌ మిథిలేష్‌ విషయంలో జరిగిన పరిణామం మాత్రం ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేసేసింది. అది ఎలా అంటారా...?
ఇదీ చదవండి: ‘రామాయణ’.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది

వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీగా..
వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీగా  బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్‌.. కేవలం రెండు రోజులకే బయటకు వచ్చేశాడు. బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాష్‌ టెంప్టేషన్‌లో భాగంగా తొలుత రూ.5 లక్షలు, ఆ తర్వాత రూ.10 లక్షలు.. చివరకు రూ.15 లక్షలకు ఆఫర్‌ పెంచారు. మిథిలేష్‌ చివరకు రూ.15 లక్షలతో బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు.ప్రైజ్‌ మనీ మాట పక్కన పెడితే..ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మిథిలేష్‌ రెండు రోజులకే తీసుకున్న  భారీ మొత్తం రూ.15 లక్షలుగా కనిపిస్తోంది.

మిథిలేష్‌ కామనర్‌ కంటెస్టెంట్‌..
మిథిలేష్‌ కామనర్‌ కంటెస్టెంట్‌ కావడంతో వారానికి రూ.70 వేలు చొప్పున ఇవ్వడానికి అంగీకరించారట. ఇలా చూసుకుంటే రెండు రోజులకు రూ.20 వేలతోపాటు ఈ రూ.15 లక్షలూ ఆయన సొంతం.  రెండు రోజులకు లెక్కిస్తే.. రోజుకు రూ.7.5 లక్షలు మొత్తంగా. 7.7 లక్షలు అందుకున్నట్లే. ఇలా అనుకుంటే కేవలం రెండు రోజుల్లోనే ఇంత డబ్బును సంపాదించుకున్న మొదటి కామనర్‌ మిథిలేష్‌ కావడం విశేషమనే చెప్పాలి. అయితే ఈ రూ.15 లక్షలు మిథిలేష్‌ రెగ్యులర్‌ రెమ్యునరేషన్‌ కాదు. హౌస్‌ నుంచి బయటకు వెళ్లేందుకు బిగ్‌బాస్‌ ఇచ్చిన ప్రత్యేక క్యాష్‌ ఆఫర్‌. అయితే కేవలం రెండు రోజుల్లోనే మనోడు రూ.15 లక్షల సొంతం చేసుకోవడంతో ప్రేక్షకుల్లో ఇంతటి ఆసక్తి నెలకొంది. 
ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్‌’ డే3 కలెక్షన్స్‌.. టాక్‌ ఎలా ఉన్నా తగ్గేదేలే!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement