బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’ | Bigg boss Telugu 10 Day 18 Episode Highlights | Sakshi
Sakshi News home page

bigg boss highlights: బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు!.. నాన్న లెటర్‌.. నరేశ్‌కు అన్యాయం!

Sep 25 2026 7:39 AM | Updated on Sep 25 2026 7:45 AM

Bigg boss Telugu 10 Day 18 Episode Highlights

బిగ్‌బాస్‌లో గొడవలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. బజర్‌ విషయంలో త్రిగుణ్‌ నిర్ణయం గొడవలు దారి తీసింది. మరో​ పక్క ఝాన్సీ లెటర్‌ విషయంలో తీసుకున్న ఆలోచన హౌస్‌లో కొత్త టెన్షన్‌ని తీసుకొచ్చింది. ఇంతలోనే ఆడియన్స్‌కి కొత్త ట్విస్ట్‌ ఎదురైంది. అసలు నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది. అసలు ప్రేక్షకులకూ, అటు హౌస్‌మేట్స్‌కు ఎదురైన ఆ ట్విస్ట్‌ ఏంటి.? ఒకసారి చూద్దాం..

ఇదీ చదవండి: పెళ్లైనా .. ఆయనపై క్రష్ తగ్గట్లేదు: రష్మిక

నరేశ్‌కు అన్యాయం జరిగిందంటూ..
బిగ్‌బాస్‌ హౌస్‌లో టాస్క్‌ సందర్భంగా బజర్‌ విషయంలో మరోసారి రచ్చ జరిగింది. నరేశ్‌ బజర్‌ కొట్టేలా అవకాశం ఇవ్వాలని రాంప్రసాద్‌ తన టీమ్‌తో మాట్లాడతాడు. అయితే సైరన్‌ మోగిన తర్వాత గార్డెన్‌ ఏరియాలో ఝాన్సీ బజర్‌ కొట్టగా.. లివింగ్‌ ఏరియాలో నరేశ్‌, వంశీ మధ్య పోటీ నెలకొంది. లివింగ్‌ ఏరియా సంచాలకుడిగా ఉన్న త్రిగుణ్‌ తొలుత నరేశ్‌ బజర్‌ కొట్టాడని ప్రకటించాడు. దీంతో నరేశ్‌ టీమ్‌ సంబరాలు చేసుకుంది. 

కానీ అమన్‌, రోహిత్‌, చరణ్‌ మాత్రం వంశీ బజర్‌ కొట్టాడని త్రిగుణ్‌కు చెప్పారు. దీంతో త్రిగుణ్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బిగ్‌బాస్‌ అడిగినప్పుడు వంశీ బజర్‌ కొట్టాడని త్రిగుణ్‌ చెప్పడంతో నరేశ్‌ మండిపడ్డాడు. తన పేరును ప్రకటించిన తర్వాత సడన్‌గా నిర్ణయం ఎలా మార్చుకుంటావంటూ ప్రశ్నించాడు. నరేశ్‌కు అన్యాయం జరిగిందంటూ సుధీర్‌, ముకేశ్‌ కూడా త్రిగుణ్‌తో వాదించారు. దీంతో బజర్‌ వ్యవహారం హౌస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

లెటర్‌ కోసం నరేశ్‌ను టార్గెట్ చేసిన ఝాన్సీ
ఆ తర్వాత ఝాన్సీ, వంశీ బజర్‌ మోగించడంతో ఇద్దరికీ బిగ్‌బాస్‌ మరో టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ఝాన్సీ విజయం సాధించింది. అనంతరం బిగ్‌బాస్‌ ఝాన్సీకి కాల్‌ చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ‘మీ నాన్న రాసిన లెటర్‌ మీ కోసం వచ్చింది. అది మీకు దక్కాలంటే నరేశ్‌ ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ను దూరం చేయాలి. లేదంటే రాంప్రసాద్‌కు వచ్చిన ఫొటోను వదులుకోవాలి’ అని బిగ్‌బాస్‌ చెప్పాడు. దీంతో ఝాన్సీ నరేశ్‌ లెటర్‌ను దూరం చేసేందుకు నిర్ణయించుకుంది. ‘నరేశ్‌కు టెన్షన్‌ ఇస్తా’ అంటూ అతడి లెటర్‌ను వదులుకుంది. మరోవైపు తన తండ్రి రాసిన లెటర్‌ను చదివిన ఝాన్సీ భావోద్వేగానికి గురైంది.

ఇదీ చదవండి: ‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్‌..?’

ఆడియన్స్‌ అనుకునేలోపే.. !
ఇక హౌస్‌మేట్స్‌కు ఒక్కొక్కరిగా వారి ఆటతీరుపై మెసేజ్‌లు రావడంతో.. అవి ఆడియన్స్‌ నుంచి వచ్చినవని అందరూ భావించారు. కానీ బిగ్‌బాస్‌ అసలు ట్విస్ట్‌ ఇచ్చాడు. అగ్నిపరీక్షలో పోరాడి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రావడానికి ప్రయత్నించిన మిథిలేష్‌, అపూర్వ, రామకృష్ణలను హౌస్‌మేట్స్‌కు పరిచయం చేశాడు. ముగ్గురినీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. అయితే వీరిలో ఎవరు హౌస్‌లోకి వెళ్లాలనేది హౌస్‌మేట్సే నిర్ణయించాలి అని బిగ్‌బాస్‌ స్పష్టం చేశాడు. దీంతో మిథిలేష్‌, అపూర్వ, రామకృష్ణలు తమను ఎందుకు హౌస్‌లోకి తీసుకోవాలో వివరించారు. 

ఈ క్రమంలో త్రిగుణ్‌, రాంప్రసాద్‌, ముకేశ్‌లతో వారికి వాగ్వాదం జరిగింది. తెలుగు మాట్లాడడంపై త్రిగుణ్‌తో వారితో వార్‌కి దిగాడు. ఈ తరుణంలో నీకు అసలు తెలుగు వచ్చా వస్తే పద్యం పాడు అంటూ మిథిలేష్‌పై త్రిగుణ్‌ రెచ్చిపోయాడు. మాటామాటా పెరగడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం కనిపించింది.
ఇదీ చదవండి: రజినీకాంత్‌ ‘జైలర్‌2’ పాటకు.. డేవిడ్‌ భాయ్‌ డ్యాన్స్‌ మాత్రం..

ముగ్గురిలో ఎవరు? హౌస్‌మేట్స్‌ ఓటింగ్‌..
వాదనలు ముగిసిన తర్వాత బిగ్‌బాస్‌ ముగ్గురినీ బయటకు పంపించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌కు కీలక నిర్ణయం అప్పగించాడు. మిథిలేష్‌, అపూర్వ, రామకృష్ణల్లో ఎవరిని హౌస్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఓటు వేయాలని చెప్పాడు. బిగ్‌బాస్‌ సూచనల మేరకు హౌస్‌మేట్స్‌ తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి.. ఆ ఓట్లను బిగ్‌బాస్‌ చెప్పిన బాక్స్‌లో వేశారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement