సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘సిగ్మా’.
జేసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పై తెలుగు–తమిళ భాషల్లో సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 2న విడుదల కానుంది.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది.
గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ...
‘‘సిగ్మా’ కథని జేసన్ జూమ్ కాల్‌లో చెప్పారు. కథ మొత్తం విన్న తర్వాత ‘మీ వయసు ఎంత?’ అని అడిగాను.
24 ఏళ్లు అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. తను స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సార్ అబ్బాయి అయినప్పటికీ అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతారు.
‘సిగ్మా’లాంటి మంచి సినిమాతో తమిళ్‌లో పరిచయం కావడం సంతోషంగా ఉంది.
నాకు దర్శకత్వం చేయాలని ఉంది. ప్రస్తుతం కథలు రాస్తున్నాను. నేను దర్శకత్వం వహించే సినిమాలో నేనే నటిస్తాను’’ అని పేర్కొన్నారు.


