పశ్చిమ బెంగాల్‌లో అదానీ గ్రూప్ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. 2035 నాటికి రాష్ట్రంలో అదానీ గ్రూప్ రూ. 1 లక్ష కోట్ల (10.43 బిలియన్‌డాలర్ల ) పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. తమ తాజా పెట్టుబడి తూర్పు రాష్ట్రమంతటా రోడ్లు, వంతెనలు, రోప్‌వేల అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని అదానీ తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి, లాజిస్టిక్స్, డేటా సెంటర్లు, ఆరోగ్య రంగం, క్లీన్ ఎనర్జీ, రోడ్లు, వంతెనలు, రోప్‌వేల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని నగరంలో కోల్‌కతా సమీపంలోని న్యూ టౌన్ ప్రాంతంలో 2,000 బెడ్లతో నిర్మించనున్న ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, రీసెర్చ్ ఫెసిలిటీ కోసం గ్రూప్ రూ. 4,000 కోట్లను (40 బిలియన్ రూపాయలు) పెట్టుబడిగా పెట్టనుంది.
ఇందులో భాగంగా న్యూ టౌన్‌లోని 'అదానీ ఆరోగ్య మందిర్' ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిపాల్గొన్నారు. కేవలం ఈ ఆరోగ్య రంగ ప్రాజెక్ట్ ద్వారానే రాష్ట్రంలో 10,000 లకు పైగా కొత్త ఉద్యోగాలను కల్పించనున్నామని అంచనా వేస్తున్నట్టు అదానీ ప్రకటించారు.
ఈ సందర్బంగా బెంగాల్ సీఎం సువేందు మాట్లాడుతూ వామపక్షాల కార్మిక సంఘవాదం, టీఎంసీ బుజ్జగింపు రాజకీయాల వల్ల బెంగాల్ పారిశ్రామిక రంగం దెబ్బతిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో గత 15 ఏళ్లుగా ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ మమతా సర్కార్‌పై సువేందు విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: జీవిత ఖైదు : కాంబోడియా ప్రియురాలితో గ్యాంగ్‌స్టర్ పెళ్లికి పెరోల్
ఇదీ చదవండి: స్లీపర్ బస్సు విషాదం : షాకింగ్ విషయాలు వెలుగులోకి
VIDEO | Kolkata: “Bengal's industrial sector suffered due to Left's trade unionism, TMC's appeasement politics”, says West Bengal CM Suvendu Adhikari (@SuvenduWB).
Speaking at the foundation stone-laying programme of Adani Arogya Mandir, Suvendu Adhikari said successive… pic.twitter.com/rGDQcvWdXn— Press Trust of India (@PTI_News) September 24, 2026
#WATCH | Kolkata: Adani Group Chairman Gautam Adani and West Bengal Chief Minister Suvendu Adhikari officially attend the foundation stone laying ceremony for the Adani Arogya Mandir hospital in New Town.
(Visuals Source: HIDCO West Bengal Government) pic.twitter.com/WKV3mn9hON— ANI (@ANI) September 24, 2026


