కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారి చేసిన చర్య ఇప్పుడు నెట్టింట్ల వైరల్‌గా మారింది. ఆ రాష్ట్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేదిత దగ్గు సిరఫ్‌లను పెద్ద మెుత్తంలో అధికారులు పట్టుకున్నారు. అయితే వాటిని ధ్వంసం చేయడం కోసం సువేందు అధికారే స్వయంగా రంగంలోకి దిగారు. నిషేదిత దగ్గు సిరఫ్‌లను అధికారులు రోడ్డుపై ఉంచగా వాటిపై రోడ్డు రోలర్ నడిపి ధ్వంసం చేశారు.
'నషా ముక్త్ భారత్ 2029' (వ్యసన రహిత భారత్ 2029) ప్రచారంలో భాగంగా సీఎం ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిషేదిత దగ్గు సిరఫ్‌లతో ఎకో పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సువేందు రోడ్డు రోలర్ నడిపి మూడు లక్షలకు పైగా దగ్గు మందు సీసాలను ధ్వంసం చేశారు.
భారత్‌ను మాదకద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ( సామాజికన్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' (NMBA) పేరుతో ఆగస్టు 15, 2020 న ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా పశ్చిమబెంగాల్‌లో ఈ చర్యలు చేపట్టారు.
దగ్గు సిరఫ్‌లు ఎందుకు ధ్వంసం
నేడు యువత అక్రమ మత్తు కోసం 'కోడీన్' వంటి మత్తు పదార్థాలు కలిగిన కొన్ని రకాల దగ్గు సిరప్‌లను విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా లభించే ఈ ఫార్మా సిరప్‌లను డ్రగ్స్‌కు ప్రత్యామ్నాయంగా వాడుతూ కొందరు వ్యసనపరులుగా మారుతున్నారు. సమాజాన్ని, ముఖ్యంగా యువతను పట్టిపీడిస్తున్న ఈ ప్రమాదకర వ్యసన సంస్కృతిని పూర్తిగా అణచివేయడం కోసమే ' ఈ నిర్ణయం తీసుకున్నారు.
#WATCH | Kolkata | West Bengal CM Suvendu Adhikari today drove a tractor and destroyed over three lakh banned cough syrup bottles at Eco Park as a part of 'Nasha Mukt Bharat 2029' campaign
(Video source: West Bengal CM Suvendu Adhikari's social media handle) pic.twitter.com/twEq3a5b5m— ANI (@ANI) September 23, 2026


