లంచ్‌బాక్స్‌లో మెంతికూర వంట.. విద్యార్థుల‌కు జ‌రిమానా! | Green Methi Not Allowed: Student Fined Rs 50 Over School Tiffin | Sakshi
Sakshi News home page

లంచ్‌బాక్స్‌లో మెంతికూర వంటకాలు తెచ్చారని..

Sep 23 2026 2:47 PM | Updated on Sep 23 2026 2:54 PM

Green Methi Not Allowed: Student Fined Rs 50 Over School Tiffin

విద్యార్థులకు జరిమానా విధించిన పాఠశాల యాజమాన్యం 
థానే జిల్లాలోని భయందర్‌లో ఘటన..

థానే: పర్యూషణ పర్వదినాల సమయంలో మెంతికూరతో వండిన ఆహారపదార్థాలను లంచ్‌బాక్సులో తెచ్చినందుకు పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు జ‌రిమానా విధించిన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లాలో వెలుగు చూసింది. భయందర్ ఈస్ట్‌లోని త‌పోవ‌న్ విద్యాల‌య‌ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రూ.50 జరిమానా విధించడమే కాక బదులుగా రూ.20 చెల్లించి క్యాంటీన్‌లో తినాలంటూ బలవంతం చేశారన్న వార్తలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం సృష్టించాయి. 

ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణలపై వివరణ కోరుతూ మీరా భయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ విద్యా విభాగం పాఠశాలకు నోటీసు జారీ చేసింది. ఈ ఆరోపణలపై పాఠశాల ఇంకా స్పందించలేదు. అయితే త‌పోవ‌న్ విద్యాల‌య‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం ఇదే మొద‌టిసారి కాద‌ని స్థానికులు చెబుతున్నారు.

కాగా మతపరమైన ఆచారాలు, పండుగలు పేరిట నిర్దిష్ట ఆహారాన్ని మాత్రమే తినితీరాలని బలవంతం చేయడమేమింటూ సోషల్‌ మీడియా వేదికగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మతపరమైన ఆచారాల ముసుగులో విద్యార్థుల ప్రాథమిక ఆహారపు ఎంపికలు, రోజువారీ ఆహార అలవాట్లను నిర్దేశించడమేమింటంటూ విజయ్‌ అనే యూజర్‌ ‘ఎక్స్‌’ వేదికగా మండిపడ్డారు.  

కఠిన ఆహార నియమాల పర్వం ‘పర్యూషణ్‌’ 
పర్యుషణ పర్వ్‌ అనేది జైన మతంలో ఉపవాసం, ఆధ్యాత్మిక చింతనకు అంకితమైన ఒక ప్రధాన వార్షిక పండుగ. ఈ పండుగ సమయంలో ఆ మతానుయాయులు, అభిమానులు ఆకు కూరలు, దుంపలను తినకుండా ఉండటంతో సహా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తారు. 

ఇదీ చ‌ద‌వండి: తుకారాం ముండే లేటెస్ట్ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement