breaking news
Mentikura
-
లంచ్‌బాక్స్‌లో మెంతికూర వంట.. విద్యార్థులకు జరిమానా!
థానే: పర్యూషణ పర్వదినాల సమయంలో మెంతికూరతో వండిన ఆహారపదార్థాలను లంచ్‌బాక్సులో తెచ్చినందుకు పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు జరిమానా విధించిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో వెలుగు చూసింది. భయందర్ ఈస్ట్‌లోని తపోవన్ విద్యాలయ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రూ.50 జరిమానా విధించడమే కాక బదులుగా రూ.20 చెల్లించి క్యాంటీన్లో తినాలంటూ బలవంతం చేశారన్న వార్తలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం సృష్టించాయి. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణలపై వివరణ కోరుతూ మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ విద్యా విభాగం పాఠశాలకు నోటీసు జారీ చేసింది. ఈ ఆరోపణలపై పాఠశాల ఇంకా స్పందించలేదు. అయితే తపోవన్ విద్యాలయపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెబుతున్నారు.కాగా మతపరమైన ఆచారాలు, పండుగలు పేరిట నిర్దిష్ట ఆహారాన్ని మాత్రమే తినితీరాలని బలవంతం చేయడమేమింటూ సోషల్ మీడియా వేదికగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మతపరమైన ఆచారాల ముసుగులో విద్యార్థుల ప్రాథమిక ఆహారపు ఎంపికలు, రోజువారీ ఆహార అలవాట్లను నిర్దేశించడమేమింటంటూ విజయ్ అనే యూజర్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. కఠిన ఆహార నియమాల పర్వం ‘పర్యూషణ్’ పర్యుషణ పర్వ్ అనేది జైన మతంలో ఉపవాసం, ఆధ్యాత్మిక చింతనకు అంకితమైన ఒక ప్రధాన వార్షిక పండుగ. ఈ పండుగ సమయంలో ఆ మతానుయాయులు, అభిమానులు ఆకు కూరలు, దుంపలను తినకుండా ఉండటంతో సహా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తారు. ఇదీ చదవండి: తుకారాం ముండే లేటెస్ట్ వార్నింగ్ -
కోడిగుడ్డు – మెంతికూర
తయారి సమయం: 35 నిమిషాలు కావలసినవి: కోడిగుడ్లు – నాలుగు (ఉడకబెట్టి, ఒక్కో దానిని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి) ఉల్లిపాయలు – 2 అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్ పసుపు – పావు టీ స్పూన్ టొమాటో – 1, ఉప్పు – సరిపడా మెంతి ఆకులు – అర కప్పు జీలకర్ర పొడి – చిటికెడు ధనియాల పొడి – 2 టీ స్పూన్లు కారం – టీ స్పూన్ గరం మసాలా పొడి – చిటికెడు నూనె – టేబుల్ స్పూన్ తయారి: ∙పాత్రలో నూనె వేడయిన తరవాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయించి అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. టొమాటోలు వేసి అయిదు నిమిషాల పాటు వేయించి పసుపు వేసి కలపాలి. ∙మెంతి ఆకులు జతచేసి మరో అయిదు నిమిషాలు వేయించాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. ∙అర కప్పు నీటిని జత చేసి కలియబెట్టి అయిదు నిమిషాలు వేగనివ్వాలి. ∙కట్ చేసిన కోడిగుడ్లు వేసి కలపాలి. మంట చిన్నది చేసి మరో ఏడు నిమిషాల పాటు వేగనివ్వాలి. lచివరగా మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా అన్నంలోకి గాని చపాతీల్లోకి గాని వడ్డిస్తే రుచిగా ఉంటుంది.


