తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి.
తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చివరి రోజున ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం (అవభృథం) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన సమస్త సేవలు సఫలమై, లోకక్షేమం, భక్తుల సుఖశాంతులు కలగాలని చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయం.


