తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
అశ్వ వాహనానికి ముందు గజరాజులు నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది.
విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవిందనామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.


