విజయనగరం : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, విజయనగరం ఆడపడుచు శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు పొటెత్తారు.
పైడితల్లి అమ్మవారి జాతరలో చివరి మంగళవారం, ఆ పై రాత్రి ఉయ్యాల కంబాల ఉత్సవం కావడంతో తల్లి దర్శనం చేసుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వెల్లువెత్తారు.
గత మంగళవారం సిరిమాను ఉత్సవం రోజు తుపాను, ఆపై ఎన్నికలు జరగడంతో భక్తులు పెద్దగా తల్లి దర్శనం చేసుకోలేదు.
పైడితల్లి జాతరలో చివరి మంగళవారం కావడంతో నగరం నుంచే కాక జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో మహిళా భక్తులు వచ్చి తల్లి దర్శనం చేసుకున్నారు.
ఉచిత బస్సు పథకం పుణ్యమా పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు మహిళా భక్తులు పొటెత్తారు.


