హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దుర్గామాత (అమ్మవారి) విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
నిమజ్జన ఏర్పాట్ల నేపథ్యంలో పంజాగుట్ట, నిరంకారి జంక్షన్, ఇక్బాల్ మినార్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్ మరియు రాణిగంజ్ పరిసర ప్రాంతాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించి, ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.


