PC: bcci
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఆసియా క్రీడల మహిళల టీ20 టోర్నమెంట్ ఫైనల్లో శ్రీలంకపై షెఫాలీ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. కోరోగి స్పోర్ట్స్ పార్క్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించింది.
తన సహచర ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షెఫాలీ.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో షెఫాలీ వర్మ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా షెఫాలీ రికార్డులకెక్కింది. ఈ ఏడాది షెఫాలీ ఇంటర్ననేషనల్ టీ20ల్లో 863 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (824)ను షెఫాలీ అధిగమించింది. కాగా ఈ టోర్నీలో షెఫాలీ మొత్తంగా 188 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతోంది.
మహిళల టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే
863 - 2026లో షఫాలీ వర్మ*
824 - 2026లో లారా వోల్వార్డ్ట్ .
800 - 2026లో నటాషా మైల్స్ (హాంకాంగ్).
779 - 2025లో ఈషా ఓజా (యూఏఈ).
779 - 2026లో యాస్మిన్ దాస్వానీ (హాంకాంగ్).
చదవండి: జపాన్‌తో చారిత్రక టీ20.. వైభవ్ ఇన్! సంజూ అవుట్?


