జపాన్‌లో క్రికెట్‌కు జై | India to Face Japan in Historic T20I Before Asian Games 2026 | Sakshi
Sakshi News home page

జపాన్‌లో క్రికెట్‌కు జై

Sep 22 2026 6:26 AM | Updated on Sep 22 2026 6:26 AM

India to Face Japan in Historic T20I Before Asian Games 2026

నేడు ఆతిథ్య జట్టుతో భారత్‌ చారిత్రాత్మక పోరు

టి20 మ్యాచ్‌కు వర్షం ముప్పు!

ఉదయం గం.9:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1 చానెల్‌లో, ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

సానో: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటి, డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ భారత్‌ తమ టి20 చరిత్రలో ఒక చారిత్రాత్మక పోరుకు సిద్ధమైంది. సానో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో నేడు భారత్, జపాన్‌ మధ్య ఏకైక టి20 మ్యాచ్‌ జరగనుంది. నంబర్‌వన్‌ టీమ్‌ భారత్, 41వ ర్యాంక్‌ టీమ్‌ జపాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలాబలాల్లో భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా ఉంది. అయితే తొలిసారి జపాన్‌ గడ్డపై భారత్‌ ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. పైగా టీమిండియా తమ పూర్తి స్థాయి బరిలోకి దిగుతుండటం మరో విశేషం. 

‘జపాన్‌లో జపాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడతానని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు’ అంటూ భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్య దీని గురించి చెబుతోంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రుల మధ్య జరిగిన భేటీలో ఈ మ్యాచ్‌ ఖరారైంది. జపాన్‌ కోణంలో చూస్తే ఈ మ్యాచ్‌ ఆ జట్టుకు ఎంతో ప్రత్యేకం కానుంది. అందుకే జపాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా అభిమానుల కోసం ఈ మ్యాచ్‌కు మంచి ప్రచారాన్ని కలి్పంచింది. మంగళవారం ఆ దేశంలో సెలవు దినం కాగా... 3,000–10,000 జపాన్‌ యెన్‌లు (సుమారు రూ. 1800–6000) ధరలతో టికెట్లు అమ్మకానికి ఉంచింది. అయితే భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ జరగడం సందేహంగా మారింది. సోమవారం పడిన వానకు భారత జట్టు ప్రాక్టీస్‌ కూడా రద్దయింది. జపాన్‌ టి20 జట్టుకు కెండెల్‌ కడోవాకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement