ఇండోనేసియాపై 17–1తో గెలిచిన భారత మహిళల హాకీ జట్టు
రుతుజా, దీపిక, నవ్‌నీత్ కౌర్ ‘హ్యాట్రిక్’
కాకామిగహారా: ఆసియా క్రీడల హాకీ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్స్ వర్షం కురిపించింది. పూల్ ‘బి’లో భాగంగా సోమవారం ఇండోనేసియాతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 17–1 గోల్స్ తేడాతో ఘనవిజయం అందుకుంది. ఆదివారం ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 19–0తో గెలిచిన సంగతి తెలిసిందే. ఇండోనేసియాతో పోరులో భారత్‌కు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు.
భారత్ తరఫున రుతుజా పిసాల్ (15వ, 20వ, 38వ ని.లో), దీపిక సెహ్రావత్ (8వ, 28వ, 40వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (35వ, 56, 57వ ని.లో) మూడు గోల్స్ చొప్పున సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు. సునెలితా టొప్పో (11వ, 30వ ని.లో), లాల్‌రెమ్‌సియామి (12, 16వ ని.లో), సాక్షి రాణా (25, 57వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. కెపె్టన్ సలీమా టెటె (35వ ని.లో), ఇషిక (36వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.
భారత జట్టుకు 11 పెనాల్టీ కార్నర్‌లు లభించగా...ఏడింటిని గోల్స్‌గా మలిచింది. ఇండోనేసియా జట్టుకు అదితియా ఇనెస్ (32వ ని.లో) ఏకైక గోల్ అందించింది. బుధవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ తలపడుతుంది. సవితా పూనియా రికార్డు ఈ మ్యాచ్‌తో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత మహిళా హాకీ క్రీడాకారిణిగా సీనియర్ గోల్‌కీపర్ సవితా పూనియా రికార్డు నెలకొలి్పంది. 320 మ్యాచ్‌లతో వందన కటారియా పేరిట ఉన్న ఈ రికార్డున 321 మ్యాచ్‌లతో సవితా సవరించింది.
వరల్డ్ చాంపియన్ ఖాతాలో మరొకటి...
రెండు సార్లు ప్రపంచ చాంపియన్... వరల్డ్ కప్‌లలో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో 5 స్వర్ణాలు, 2 కాంస్యాలు, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణం... జపాన్‌లో పోటీలకు ముందే రుద్రాంష్ పాటిల్ పతకాల జాబితా ఇది. ఇప్పుడు వీటికి తోడు సోమవారం మరో రజతం, కాంస్యం అతని ఖాతాలో చేరాయి. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న షూటర్‌గా 23 ఏళ్లు రుద్రాంష్ గుర్తింపు పొందాడు.
నాలుగేళ్ల క్రితమే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన అతను అభినవ్ బింద్రా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత్ రైఫిల్ షూటర్‌గా నిలిచాడు. మహారాష్ట్రలోని థానేకు చెందిన రుద్రాంష్ గత ఆసియా క్రీడల్లో వరల్డ్ రికార్డు స్కోరు కూడా నమోదు చేశాడు. అయితే ఇన్ని రికార్డుల తర్వాత కూడా రుద్రాంష్ కు కనీసం ‘అర్జున అవార్డు’ కూడా దక్కలేదు. గత మూడేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా తనను ఎంపిక చేయలేదంటూ నిరాశ వ్యక్తం చేసిన అతను... తాజా ఆసియా క్రీడల ప్రదర్శనతోనైనా అవార్డు వరిస్తుందని ఆశిస్తున్నాడు.
రెజ్లింగ్ నుంచి షూటింగ్ వైపు...
జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన హిమాన్షు ఢిల్లాన్‌కు సీనియర్ స్థాయిలో ఇదే తొలి అంతర్జాతీయ పతకం కావడం విశేషం. ఈ నెల 29న తన 21వ పుట్టిన రోజు జరుపుకోనున్న హిమాన్షు వారం రోజుల ముందు తనకు తానే ప్రత్యేక కానుక ఇచ్చుకున్నాడు. హరియాణాలోని కైథల్ అతని స్వస్థలం. చిన్నప్పుడు క్రమశిక్షణ తప్పుతున్నాడని అతని తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు పంపించి చదివించారు.
మరోవైపు 2016 రియో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో బరిలోకి దిగిన అతని బాబాయ్ హర్దీప్ సింగ్ ఢిల్లాన్ ప్రోత్సాహంతో హిమాన్షుకు రెజ్లింగ్ కూడా నేర్పించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రీడ చాలా కష్టంగా ఉందని, తన వల్ల కాదంటూ అతను తప్పుకున్నాడు. ఆ తర్వాత కోవిడ్ సమయంలో షూటింగ్‌పై ఆసక్తి కలిగి అతను గన్ పట్టుకున్నాడు. ఇక్కడ మాత్రం ఉదాసీనత కనబర్చలేదు. కోచ్, కుటుంబ సభ్యుల అండదండలతో తీవ్రంగా శ్రమించిన అతను దూసుకుపోయాడు. జూనియర్ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆసియా క్రీడల పతకం వరకు చేరాడు.
మరో కొత్త కెరటం...
భారత షూటింగ్‌లో 19 ఏళ్ల పార్థ్ మానే కూడా కొత్తగా దూసుకొచ్చాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం జూనియర్ వరల్డ్ చాంపియన్‌లో చాంపియన్‌గా నిలిచి వెలుగులోకి వచి్చన అతను అదే జోరును సీనియర్ స్థాయిలోనూ కొనసాగించాడు. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికైన పార్థ్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ టీమ్ ఈవెంట్‌లో భారత్ రజత విజయంలో తన పాత్ర పోషించాడు. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన పార్థ్... పోలీసు అయిన తండ్రి ప్రోత్సాహంతో షూటింగ్‌లోకి వచ్చాడు. ముంబైలో ఒలింపియన్ సుమా శిరూర్ వద్ద శిక్షణ తీసుకుంటూ తన ఆటకు మరింత మెరుగులు దిద్దుకున్న అతను ఇప్పుడు తొలి ప్రయత్నంలోనే ఏషియాడ్ పతకం గెలుచుకున్నాడు. త్వరలో ఖతర్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు, ఆపై 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తన ప్రస్తుత లక్ష్యమని పార్థ్ వెల్లడించాడు.


