IND: జపాన్‌, లంక, ఆసీస్‌తో.. రేపు రెండు టీ20లు, ఒక ‘టెస్టు’! | SEPT 22: IND vs JPN IND W vs SL W IND A vs AUS A Timings Where Watch | Sakshi
Sakshi News home page

IND: జపాన్‌, లంక, ఆసీస్‌తో.. రేపు రెండు టీ20లు, ఒక ‘టెస్టు’!

Sep 21 2026 5:32 PM | Updated on Sep 21 2026 5:51 PM

SEPT 22: IND vs JPN IND W vs SL W IND A vs AUS A Timings Where Watch

PC: Sonysports/JCA X

భారత క్రికెట్‌ అభిమానులకు మంగళవారం (సెప్టెంబరు 22) పండుగే!.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు మ్యాచ్‌లకు రేపు షెడ్యూల్‌ ఖరారైంది. ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో భాగంగా భారత్‌ శ్రీలంకతో తలపడేందుకు సిద్ధమైంది.

ఈ  పసిడి పతక పోరులో  హర్మన్‌ సేన- చమరి ఆటపట్టు బృందం అమీతుమీ తేల్చుకుంటాయి. మరోవైపు.. చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా (పురుషుల జట్టు) జపాన్‌తో తొలిసారి టీ20 మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది.

మరో మ్యాచ్‌లో భారత్‌-‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భాగంగా మంగళవారమే తొలి మ్యాచ్‌ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో భారత జట్లకు సంబంధించిన మూడు మ్యాచ్‌ల వేదికలు, షెడ్యూల్‌, టైమింగ్స్‌, జట్లు, ప్రత్యక్ష ప్రసారం వివరాలు తెలుసుకుందామా?!

ఆసియా క్రీడలు- 2026 మహిళల ఫైనల్‌- భారత్‌ వర్సెస్‌ శ్రీలంక
వేదిక: నిశిన్‌, కరోగి స్పోర్ట్స్‌ పార్కు, జపాన్‌
మ్యాచ్‌ ఆరంభ సమయం: ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభం
లైవ్‌ స్ట్రీమింగ్‌: సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, సోనీలివ్‌

భారత జట్టు
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), రిచా ఘోష్(వికెట్‌ కీపర్‌), భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, నందినీ శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్.

శ్రీలంక జట్టు
ఇమేషా దులానీ, చమరి ఆటపట్టు (కెప్టెన్‌), హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషని నుత్యాంగన(వికెట్‌ కీపర్‌), మిథాలీ అయోధ్య, కావ్య కవింది, చాముది ప్రభోద, సుగందిక కుమారి, రష్మిక సెవ్వాంది, నిమషా మేపగే, సంజన కవింది, అనుష్క సంజీవని.

టీమిండియా వర్సెస్‌ జపాన్‌
వేదిక: సనో అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం, జపాన్‌
భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్‌ ఆరంభం
ప్రత్యక్ష ప్రసారం: స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ (టీవీ), ఫ్యాన్‌కోడ్‌ యాప్‌, వెబ్‌సైట్‌ (డిజిటల్‌).

టీమిండియా
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శివం దూబే, తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయి, రవి బిష్ణోయి, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, వైభవ్‌ సూర్యవంశీ, యశ్‌ ఠాకూర్‌, విప్రాజ్‌ నిగమ్‌.

జపాన్‌
కెండెల్‌ కడోవాకీ ఫ్లెమింగ్‌ (కెప్టెన్‌), చార్లీ హరా హింజే, బెంజమిన్‌ ఇటో-డేవిస్‌, కొయి కుబోటా, వటారు మియాచి, రియో సకురనో-థామస్‌, అలెక్స్‌ శిరాయి-పాట్‌మోర్‌, షోమా సుగయా-స్లేటర్‌, డెక్లాన్‌ సుజుకి, ఇబ్రహీం తకహషి, మకొటో తానియమా, లచ్లాన్‌ యమామొటో, అలెస్టెర్‌ కడోవాకీ-ఫ్లెమింగ్‌, జేక్‌ కుసుడ-నైర్‌, సుయోషి తకడా.

భారత్‌- ‘ఎ’ వర్సెస్‌ ఆస్ట్రేలియా- ‘ఎ’ అనధికారిక తొలి టెస్టు
వేదిక: పుదుచ్చేరి క్రికెట్‌ అసోసియేషన​ సిచెమ్‌ గ్రౌండ్‌, పుదుచ్చేరి, ఇండియా
భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్‌ ఆరంభం
జియోహాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

భారత్‌- ‘ఎ’ జట్టు
అమన్‌ మోఖడే, ఆయుశ్‌ పాండే, దేవదత్‌ పడిక్కల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌ (వైస్‌ కెప్టెన్‌), యశ్‌ రాథోడ్‌, షేక్‌ రషీద్‌, కుమార్‌ కుశాగ్ర (వికెట్‌ కీపర్‌), షామ్స్‌ ములాని, తనుష్‌ కొటియాన్‌, తుషార్‌ దేశ్‌పాండే, అన్షుల్‌ కాంబోజ్‌, ప్రఫుల్‌ హింగే, నారాయణన్‌ జగదీశన్‌ (వికెట్‌ కీపర్‌), నచికేత్‌ భూటే, వి వైశాక్‌* (ఫిట్‌నెస్‌ ఆధారంగా).

ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టు
బ్రెండన్‌ డాగెట్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌, సామ్‌ హార్పర్‌, లియామ్‌ హాచర్‌, కాంప్‌బెల్‌ కెల్లావే, సామ్‌ కొన్‌స్టాస్‌, నాథన్‌ మెక్‌స్వీనీ, టాడ్‌ మర్ఫీ, ఫెర్గూస్‌ ఓ నీల్‌, జోష్‌ ఫిలిప్‌, జై రిచర్డ్‌సన్‌, కోరే రొచిసియోలి, జేసన్‌ సంఘా, లియామ్‌ స్కాట్‌.

చదవండి: ప్రభుత్వం ఇచ్చిన భూమిలో టీమిండియా స్టార్‌ రూ. 7 కోట్ల బంగ్లా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement