Asian Games 2026: జ‌పాన్‌ను చిత్తుగా ఓడించిన భార‌త్‌ | Asian Games 2026: India-Mens-Team-Beat-Hosts Japan-Kabaddi-Game | Sakshi
Sakshi News home page

Asian Games 2026: జ‌పాన్‌ను చిత్తుగా ఓడించిన భార‌త్‌

Sep 21 2026 3:01 PM | Updated on Sep 21 2026 3:09 PM

Asian Games 2026: India-Mens-Team-Beat-Hosts Japan-Kabaddi-Game

Photo Credit: SAI Media Twitter

ఆసియా గేమ్స్‌లో భార‌త పురుషుల క‌బ‌డ్డీ జ‌ట్టు శుభారంభం చేసింది. గ్రూప్‌-ఏలో భాగంగా సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 49-24తో ఆతిథ్య జ‌పాన్‌ను చిత్తుగా ఓడించింది. ఎనిమిది సార్లు క‌బ‌డ్డీ చాంపియ‌న్ అయిన భార‌త్ ముందు జ‌పాన్ ఆట‌లు సాగ‌లేదు. హాఫ్ టైమ్ ముగిసేస‌రికే భార‌త్ 31-9తో జ‌పాన్‌పై స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్‌లోనూ 40-12తో దూకుడు క‌న‌బ‌రిచింది. 

ఆశూ మాలిక్‌, దేవాంక్ ద‌లాల్ త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆకట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో సీనియ‌ర్లు ప‌వ‌న్ సెహ్రావ‌త్‌, అర్జున్ దేశ్వాల్‌, అస్లామ్ ఇనామ్‌దార్‌లు కొద్దిసేపు మాత్ర‌మే పాల్గొన్నప్ప‌టికీ, బ‌ల‌మైన ఇంపాక్ట్ చూపించారు. ఆశూ సూప‌ర్ రైడ్‌తో మూడు టాకిల్ పాయింట్లు సాధించాడు. 

ఇక భార‌త్ సాధించిన 49 పాయింట్ల‌లో 36 పాయింట్ల‌ను నేరుగా పొంద‌గా, జ‌పాన్ మాత్రం తాను సాధించిన మొత్తం పాయింట్ల‌లో మూడో వంతు బోనస్ లైన్ నుంచే రాబ‌ట్టడం గ‌మ‌నార్హం. గ్రూప్‌-ఏలో ఉన్న భార‌త్ త‌మ త‌ర్వాతి మ్యాచ్‌లో ఇదే వేదిక‌పై రిప‌బ్లిక్ ఆఫ్ కొరియాతో త‌ల‌ప‌డ‌నుంది. 2018 జ‌క‌ర్తా ఆసియా గేమ్స్‌లో ఇరాన్ స్వర్ణం మిన‌హా మిగ‌తా అన్ని ఎడిష‌న్ల‌లో భార‌త్ స్వ‌ర్ణ ప‌తకాలు సాధించింది. ఇక ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త పురుషుల జ‌ట్టు రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు చాంపియ‌న్‌గా నిలిచింది.

క్వార్ట‌ర్స్‌లో భార‌త్‌
ఇక బ్యాడ్మింట‌న్ విభాగంలో భార‌త పురుషుల జ‌ట్టు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన ప్రిక్వార్ట‌ర్స్‌లో భార‌త్ 3-0తో విజ‌యం సాధించింది. తొలి మ్యాచ్‌లో ల‌క్ష్య‌సేన్ 21-4, 21-12తో జ‌మాన్ అయ్‌మ‌న్‌పై, రెండో మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 21-4, 21-13తో గౌర‌బ్ సింఘాపై, చివ‌రి మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-15, 21-9తో జుమ‌ర్ అల్ అమిన్‌పై విజ‌యాలు సాధించారు. సెప్టెంబ‌ర్ 22న జ‌పాన్ జ‌ట్టుతో భార‌త్‌ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భార‌త్ ఖాతాలో క‌నీసం కాంస్యం ఖాయ‌మ‌వుతుంది.

ఇదీ చదవండి: IND vs JPN T20I: జట్లు, టైమింగ్‌, ప్రత్యక్ష ప్రసారం.. వివరాలు ఇవే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement