Asian Games 2026: మహిళల ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం | Asian Games: Suchika Tariyal Makes History With Bronze In Womens MMA competition | Sakshi
Sakshi News home page

Asian Games 2026: మహిళల ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం

Sep 21 2026 10:19 AM | Updated on Sep 21 2026 10:30 AM

Asian Games: Suchika Tariyal Makes History With Bronze In Womens MMA competition

source: X

ఏషియన్‌ గేమ్స్‌లో భారత మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) అథ్లెట్‌ సుచికా తరియాల్‌ చరిత్ర సృష్టించింది. మహిళల సంప్రదాయ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి, ఏషియన్‌ గేమ్స్‌ ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.

సెమీఫైనల్లో ఓటమి
సుచికా తరియాల్‌ సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్‌ హూన్‌ టియో చేతిలో 0-2తో ఓటమి పాలైనప్పటికీ.. భారత్‌కు ఈ క్రీడలో తొలి పతకాన్ని అందించి చరిత్రలో నిలిచింది.

ఆదివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో సుచికా.. మంగోలియాకు చెందిన ఆల్టాన్‌చిమెగ్‌ బైగల్‌మాను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంతోనే భారత్‌కు ఏషియన్‌ గేమ్స్‌ ఎంఎంఏలో తొలి పతకం ఖాయమైంది.

ఇదీ చదవండి: ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మూడో పతకం



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement