ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మూడో పతకం | Asian Games 2026: India's Himanshu Dhillon, Parth Mane and Rudrankksh Patil win silver in mens 10m Air Rifle team | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మూడో పతకం

Sep 21 2026 7:55 AM | Updated on Sep 21 2026 8:55 AM

Asian Games 2026: India's Himanshu Dhillon, Parth Mane and Rudrankksh Patil win silver in mens 10m Air Rifle team

source: X

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. రెండో రోజు పోటీల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు మరో రజత పతకం లభించింది. హిమాంశు ధిల్లాన్‌, పార్థ్‌ మానే, రుద్రాంక్ష్‌ పాటిల్‌తో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. ఈ ఈవెంట్‌లో చైనా ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణం​ గెలిచింది.

తాజా పతకంతో ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది. పోటీల తొలి రోజు కూడా భారత్‌ ఖాతాలో రెండు రజత పతకాలే చేరాయి. అవి కూడా షూటింగ్‌లోనే రావడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్‌ వలరివన్‌.. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో సోనమ్‌ మస్కర్‌, విదర్సా వినోద్‌, ఎలావెనిల్‌ వలరివన్‌ రజత పతకాలు సాధించారు.

కాగా, ఇదే ఈవెంట్‌ వ్యక్తిగత విభాగంలోనూ భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. దీంతో షూటింగ్‌లో భారత్‌ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement