8 గోల్స్‌తో దీపిక సెహ్రావత్ రికార్డు
కాకామిల్‌గహారా: లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత మహిళల, పురుషుల జట్లు తమ తొలి మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిపించారు. పూల్ ‘బి’లో భారత మహిళల జట్టు ఏకంగా 19–0 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్‌ను చిత్తు చేసింది. భారత స్టార్ డ్రాగ్ ఫ్లికర్ దీపిక సెహ్రావత్ 8 గోల్స్‌తో (8వ, 22, 25వ, 33వ, 36వ, 38వ, 41వ, 54వ నిమిషాల్లో) హడలెత్తించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ చేసిన భారత మహిళా క్రీడాకారిణిగా దీపిక రికార్డు నెలకొలి్పంది.
ఇషిక (11వ, 42వ, 54వ నిమిషాల్లో) మూడు గోల్స్... లాల్‌థాన్‌లువాంగి (43వ, 51వ నిమిషాల్లో), నవ్‌నీత్ కౌర్ (23వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. లాల్‌రెమ్‌సియామి (7వ ని.లో), బల్జీత్ కౌర్ (12వ ని.లో), నేహా (18వ ని.లో), సాక్షి రాణా (43వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ మ్యాచ్‌తో సీనియర్ గోల్‌కీపర్ సవితా పూనియా భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (320) ఆడిన ప్లేయర్‌గా వందన కటారియా పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది.
దిల్‌ప్రీత్ నాలుగు గోల్స్...
మరోవైపు భారత పురుషుల జట్టు పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో 13–1 గోల్స్ తేడాతో ఇండోనేసియాను ఓడించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (18వ, 19వ, 37వ, 49వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో మెరిశాడు. శిలానంద్ లాక్రా (6వ, 35వ ని.లో), సుఖ్‌జీత్ సింగ్ (38వ, 48వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. అభిõÙక్ (12వ ని.లో), మన్‌దీప్ సింగ్ (21వ ని.లో), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (28వ ని.లో), జుగ్‌రాజ్ సింగ్ (47వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఇండోనేసియా జట్టుకు ఆలియా అల్ అర్ధ్ (33వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత జట్టుకు ఏడు పెనాల్టీ కార్నర్‌లు రాగా... మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది.


