womens hockey
-
తెలంగాణ, ఆంధ్ర జట్లు చిత్తు
జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. పూల్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 11–0 గోల్స్ తేడాతో తెలంగాణపై ఘన విజయం సాధించింది. బెంగాల్ ప్లేయర్ సంజన ‘హ్యాట్రిక్’ సహా ఐదు గోల్స్ సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో సుస్మిత పన్నా కూడా ‘హ్యాట్రిక్’ సాధించగా... మోనికా నాగ్ 2, అంజన డుంగ్‌డుంగ్ ఒక గోల్ చేశారు. ఈ గెలుపుతో బెంగాల్ జాతీయ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో వైపు పూల్ ‘సి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 11–2 గోల్స్‌తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందింది. భారత సీనియర్ జట్టు ప్లేయర్ వందనా కటారియా ‘హ్యాట్రిక్’ సాధించగా... ముంతాజ్ ఖాన్, ఉపాసన సింగ్ చెరో 2 గోల్స్ కొటారు. యూపీ తరఫున శశికళ, రీతూ సింగ్, స్వర్ణిక రావత్, సిమ్రన్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లలో కళ్యాణి స్వర్ణపూడి, గార్లంక వరహాలమ్మ ఒక్కో గోల్ కొట్టారు. అయితే ఈ విజయం తర్వాత కూడా గ్రూప్‌లో రెండో స్థానంలో నిలవడంతో యూపీ నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. -
గుజరాత్‌పై తెలంగాణ ఘనవిజయం
పుణే: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు తొలి విజయం నమోదు చేసింది. పూల్ ‘హెచ్’లో భాగంగా గుజరాత్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 12–0 గోల్స్ తేడాతో జయభేరి మోగించింది. తెలంగాణ తరఫున కెపె్టన్ ఈదుల జ్యోతి (24వ, 26వ, 27వ ని.లో) ‘హ్యాట్రిక్’ సాధించగా... గంధపు శ్రీచందన (9వ, 37వ ని.లో), హర్లీన్ కౌర్ సర్దాని (14వ, 47వ ని.లో), ప్రీతి దార్ల (25వ, 57వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. చెక్కల అనూష (44వ ని.లో), అఖిల మాండ్లా (45వ ని.లో), ముప్పాల వర్షిత (56వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. తమిళనాడుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. -
భారత్ 1–0 ఆస్ట్రేలియా
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ (మహిళలు)లో భారత జట్టు పటిష్ట ఆస్ట్రేలియాపై ప్రతీకార విజయం సాధించింది. పది రోజుల క్రితం గత లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఓడిన భారత మహిళలు శనివారం సంచలన విజయాన్ని అందుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ 1–0 గోల్ తేడాతో ఆసీస్‌ను ఓడించింది. భారత్ తరఫున ఏకైక గోల్‌ను 34వ నిమిషంలో వందన కటారియా సాధించింది. పెనాల్టీ కార్నర్ ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని భారత్ సమర్థంగా వాడుకోగలిగింది. భారత సీనియర్లు, జూనియర్లు సమష్టి ప్రదర్శనతో చెలరేగగా...ఆసీస్ బృందం పూర్తి తడబాటుతో వెనుకంజ వేసింది. 1996 తర్వాత భారత గడ్డపై ఆస్ట్రేలియాను భారత మహిళల జట్టు ఓడించడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
రన్నరప్‌గా నిలిచిన భారత్
మస్కట్: మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని కెపె్టన్సీలోని భారత జట్టు 2–7 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున జ్యోతి ఛత్రి (20వ ని.లో), రుతుజా (23వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించింది. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మస్కట్‌లో నమీబియాతో జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 7–2తో గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. -
భారత హాకీ జట్టుకు రెండో గెలుపు
మస్కట్: మహిళల ‘ఫైవ్స్’ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. అమెరికాతో జరిగిన పూల్ ‘సి’ రెండో మ్యాచ్‌లో టీమిండియా 7–2 గోల్స్‌తో గెలిచింది. భారత్ తరఫున మరియానా (20వ, 22వ ని.లో), దీపిక (23వ, 25వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేయగా... ముంతాజ్ (27వ ని.లో), అజ్మీనా (29వ ని.లో), మహిమ (17వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. పోలాండ్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–4తో గెలిచింది. -
నేడు జపాన్‌పై గెలిస్తేనే భారత జట్టుకు ‘పారిస్’ బెర్త్
రాంచీ: మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ సెమీఫైనల్లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. జర్మనీతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా ‘షూటౌట్’లో 3–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో జర్మనీ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తొలి సెమీఫైనల్లో అమెరికా 2–1తో జపాన్ను ఓడించి పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మూడో బెర్త్ కోసం నేడు భారత్, జపాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. జర్మనీతో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున దీపిక (15వ ని.లో), ఇషిక (59వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జర్మనీ జట్టుకు చార్లోటి (27వ, 57వ ని.లో) రెండు గోల్స్ అందించింది. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ఫలితం తేలడానికి ‘సడెన్‌డెత్’ను నిర్వహించగా... తొలి ప్రయత్నంలో రెండు జట్లు విఫలమయ్యాయి. రెండో ప్రయత్నంలో భారత ప్లేయర్ సంగీత గురి తప్పగా... జర్మనీ ప్లేయర్ లీసా నోల్టి గోల్ చేసి జర్మనీ విజయాన్ని ఖరారు చేసింది. -
ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా.. నేడు పటిష్టమైన జర్మనీతో భారత్ 'ఢీ'
Women's Hockey Olympic Qualifiers: మరో మ్యాచ్ కోసం ఎదురు చూడకుండా... పటిష్టమైన జర్మనీపై గెలిచి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత మహిళల హాకీ జట్టు ఉంది. రాంచీలో జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఈరోజు జర్మనీతో భారత్; అమెరికాతో జపాన్ తలపడనున్నాయి. సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ చేరిన రెండు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో ఓడిన జట్ల మధ్య మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టుకు మాత్రమే చివరిదైన మూడో బెర్త్ ఖరారవుతుంది. దాంతో భారత్‌తోపాటు మిగతా మూడు జట్లు కూడా సెమీఫైనల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. 2006 నుంచి జర్మనీతో ఏడుసార్లు తలపడ్డ భారత్ ఐదుసార్లు ఓడిపోయి, కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో జర్మనీపై గెలవాలంటే భారత్ సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
సెమీస్‌లో భారత్.. ఒలింపిక్స్ బెర్త్ అవకాశాలు సజీవం
రాంచీ: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలను భారత మహిళల హాకీ జట్టు సజీవంగా నిలబెట్టుకుంది. ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సవితా పూనియా సారథ్యంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఇటలీ జట్టుతో జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ఉదిత రెండు గోల్స్ (1వ, 55వ ని.లో) చేయగా... దీపిక (41వ ని.లో), సలీమా టెటె (45వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (53వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఇటలీ జట్టుకు కామిలా మాచిన్ (ప్లస్ 60వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో అమెరికా 1–0తో న్యూజిలాండ్‌ను ఓడించింది. దాంతో గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అమెరికా 9 పాయింట్లతో టాపర్‌గా నిలువగా... రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ 6 పాయింట్లతో రెండో స్థానం సంపాదించి సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో జపాన్‌తో అమెరికా; జర్మనీతో భారత్ తలపడతాయి. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. -
పరాజయంతో మొదలుపెట్టిన భారత్.. ఆరు అవకాశాలు లభించినా..!
రాంచీ: మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీని భారత జట్టు ఓటమితో మొదలు పెట్టింది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 0–1 తేడాతో అమెరికా చేతిలో పరాజయంపాలైంది. అమెరికా తరఫున 16వ నిమిషంలో తామెర్ అబిగైల్ ఏకైక గోల్ నమోదు చేసింది. తొలి క్వార్టర్ హోరాహోరీ సాగి ఒక్క గోల్ కూడా నమోదు కాకపోగా, రెండో క్వార్టర్ ఆరంభంలోనే యూఎస్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత భారత మహిళలు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్కోరును సమం చేయలేకపోయారు. దురదృష్టవశాత్తూ ఆరు పెనాల్టీ అవకాశాలు వచ్చినా... ఒక్కదానిని కూడా గోల్‌గా మలచలేక భారత్ వృథా చేసుకుంది. నేడు జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. -
జాతీయ హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్ర అమ్మాయి
వచ్చే నెలలో స్పెయిన్‌లో జరిగే ఐదు దేశాల హాకీ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా హాకీ ఇండియా (హెచ్ఐ) ఈనెల 22 నుంచి డిసెంబర్ 10 వరకు బెంగళూరులో జాతీయ శిక్షణ శిబిరం నిర్వహించనుంది. 34 మందితో కూడిన బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఇతిమరపు రజని కూడా చోటు దక్కించుకుంది. ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత్‌తోపాటు ఐర్లాండ్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్ జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీ తర్వాత భారత్ జనవరిలో స్వదేశంలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో పోటీపడుతుంది. -
ఛాంపియన్ భారత్
రాంచీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున సంగీత కుమారి (17వ ని.లో), నేహా (46వ ని.లో), లాల్రెమ్సియామి (57వ ని.లో), వందన కటారియా (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. Congrats to the 🇮🇳 Women’s 🏑 team as they beat 🇯🇵 4-0 in the final to win the Asian Champions Trophy at Ranchi. 7 matches,7 convincing wins. After the disappointment of missing out on the Asian Games🥇this will give the team huge confidence for the Olympic Qualifiers in 2024 pic.twitter.com/6XY2yPCc4m— Viren Rasquinha (@virenrasquinha) November 5, 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీని భారత్ నెగ్గడం ఇది రెండోసారి. 2016లో టీమిండియా తొలిసారి ఈ టైటిల్ సాధించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలిగా రూ. 3 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపింది. -
పేదరికం.. ఎన్నో అవమానాలు.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ హాకీ ప్లేయర్
భారత దేశంలో నేటికి కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రతి విషయంలో వారిపై అంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. వారు మనసు నచ్చిన ఏ పనిని స్వేచ్ఛగా చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు మద్దతు ఉన్నా, సమాజం ప్రతి విషయంలో వారిని కుళ్ళబొడుస్తూనే ఉంది. ఇలాంటి అనుభవాలనే భారత దేశం గర్వించదగ్గ మహిళా హాకీ ప్లేయర్ వందనా కటారియా కూడా ఎదుర్కొంది. తనకు ఎంతో ఇష్టమైన క్రీడను (హాకీ) ఆడే క్రమంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అబ్బాయిలు ఆడే ఆటలు అమ్మాయిలకు ఎందుకని చుట్టుపక్కల వాళ్లు చులకన చేశారు. అబ్బాయిల్లా పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకోవడమేంటని అవహేళన చేశారు. ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులను కూడా నిందించారు. ఓ దశలో అమ్మాయిగా ఎందుకు పుట్టానా అని ఆమె బాధపడింది. అసలే పేదరికంతో బాధపడుతుంటే చుట్టుపక్కల వాళ్లు సూటిపోటీ మాటలతో మరింత వేధించారు. ఇలాంటి సమయంలోనే ఆమె గట్టిగా ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆటతోనే విమర్శకుల నోళ్లు మూయించాలని డిసైడైంది. ఆ క్రమంలో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రస్తుతం యావత్ భారత దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్యే 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వందన కటారియా.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించిన వందన.. భారత మహిళా హాకీ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్‌గా కొనసాగుతుంది. భారత్ తరఫున జూనియర్ వరల్డ్‌కప్ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకు ప్రాతినిథం వహించిన ఆమె.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా తొలిసారి దేశవ్యాప్త గుర్తింపు దక్కించుకుంది. అయితే అదే ఒలింపిక్స్ వందనతో పాటు ఆమె కుటుంబానికి కూడా చేదు అనుభవాలను మిగిల్చింది. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్స్‌లో భారత్.. అర్జెంటీనా చేతిలో ఓడిపోవడంతో వందన, ఆమె కుటుంబం కులపరమైన దూషణలను ఎదుర్కొంది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న జట్టులో వందన లాంటి చాలా మంది దళితులు ఉన్నందున సెమీస్‌లో భారత్ ఓడిందని కొందరు అగ్రవర్ణ పురుషులు ఆమె కుటుంబాన్ని దుర్భాషలాడారు. ఇలాంటి అవమానాలను తన 14 ఏళ్ల కెరీర్లో అనునిత్యం ఎదుర్కొన్న వందన.. మహిళల హాకీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, విమర్శకుల నోళ్లు మూయించింది. 31 సంవత్సరాల వందన.. తన అక్కను చూసి హాకీ పట్ల ఆకర్శితురాలైంది. కనీసం బూట్లు కూడా కొనలేని స్థితి నుంచి నేడు దేశం గర్వించదగ్గ స్టార్‌గా ఎదిగింది. హాకీ స్టిక్ కొనే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆమె చెట్ల కొమ్మలతో సాధన చేసి ఈ స్థాయికి చేరింది. ఓ పక్క పేదరికంతో బాధపడుతూ.. మరోపక్క అవమానాలను దిగమింగుతూ సాగిన వందన ప్రస్తానం భారత దేశ మధ్యతరగతి అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుంది. -
అజేయ భారత్.. జపాన్‌పై గెలుపు
రాంచీలో జరుగుతున్న మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మరో విజయాన్ని అందుకుంది. టోర్నీలో ఇది భారత్‌కు వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం. మంగళవారం హోరాహోరీగా జరిగిన పోరులో భారత్ 2–1 గోల్స్ తేడాతో జపాన్ను ఓడించింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ 31వ నిమిషంలో ఫీల్డ్ గోల్ సాధించగా...47వ నిమిషంలో సంగీత కుమారి పెనాల్టీని గోల్‌గా మలచింది. జపాన్‌కు లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకుంటూ 37వ నిమిషంలో ఉరాటా కానా గోల్ నమోదు చేసింది. భారత సీనియర్ ప్లేయర్ వందన కటారియాకు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా హాకీ ఇండియా ఆమెను ఘనంగా సన్మానించింది. టోర్నీలో థాయిలాండ్, మలేసియా, చైనా, జపాన్‌లను ఓడించి భారత్ నేడు జరిగే మ్యాచ్‌లో కొరియాతో తలపడుతుంది. -
లెక్క సరిచేసిన భారత్.. చైనాపై ప్రతీకార విజయం
రాంచీ: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. చైనా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున దీపిక (15వ ని.లో), సలీమా టెటె (26వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. చైనా జట్టుకు జాంగ్ జియాకి (41వ ని.లో) ఒక గోల్ అందించింది. ఈ గెలుపుతో ఇటీవల హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా జట్టు చేతిలో సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. -
భారత మహిళల హాకీ జట్టుకు టైటిల్
సలాలా (ఒమన్): మహిళల హాకీ ఆసియా కప్ ఫైవ్స్ (ఐదుగురు ఆడే) టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. తద్వారా 2024 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 7–2 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్ జట్టును ఓడించింది. భారత్ తరఫున జ్యోతి, మరియానా కుజుర్ రెండు గోల్స్ చొప్పున సాధించగా... కెప్టెన్ నవ్‌జ్యోత్ కౌర్, మోనికా టొప్పో, మహిమా చౌదరీ ఒక్కో గోల్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన జట్లు తలపడే తొలి హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ వచ్చే జనవరి 24 నుంచి 27 వరకు మస్కట్‌లో జరుగనుంది. -
ఫైనల్లో టీమిండియా సంచలన విజయం.. టైటిల్ సొంతం
జపాన్‌లో జరిగిన మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ ఫైనల్లో సంచలనం నమోదైంది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఫోర్ టైమ్ ఛాంపియన్స్ దక్షిణ కొరియాకు షాకిచ్చారు. తుది పోరులో టీమిండియా.. 2-1 గోల్స్ తేడాతో సౌత్ కొరియాను ఖంగుతినిపించి, తొలిసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. The winning moments ✨️ Here a glimpse of the winning moments after the victory in the Final of Women's Junior Asia Cup 2023.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/ZJSwVI80iH — Hockey India (@TheHockeyIndia) June 11, 2023 అన్నూ 22వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించగా.. ఆతర్వాత సౌత్ కొరియా తరఫున 25వ నిమిషంలో పార్క్ సియో ఇయోన్ గోల్ చేసి స్కోర్‌ను సమం చేసింది. అనంతరం రెండో అర్ధభాగం 41వ నిమిషంలో నీలమ్ డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్ చేసి మరోసారి భారత్‌కు ఆధిక్యం అందించింది. దీని తర్వాత సౌత్ కొరియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, భారత అమ్మాయిలు అద్భుతమైన డిఫెన్స్‌తో వారిని అడ్డుకున్నారు. 🇮🇳 2-1 🇰🇷 Our girls create HISTORY💥 India defeats 4-time champions South Korea in an intriguing final to lift its first-ever Women's Junior Hockey Asia Cup title!#Hockey 🏑| #AsiaCup2023 pic.twitter.com/bSpdo2VB5N — The Bridge (@the_bridge_in) June 11, 2023 రెండో అర్ధభాగం చివరి నిమిషం వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయినా సౌత్ కొరియా అమ్మాయిలకు ఫలితం దక్కలేదు. దీంతో జూనియర్ విభాగంలో భారత్ అమ్మాయిలు తొలిసారి ఆసియా ఛాంపియన్లుగా అవతరించారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంతో దిగాలుగా ఉన్న అభిమానులకు ఈ విజయం ఊరటనిచ్చింది. భారత మహిళల జూనియర్ హాకీ టీమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
16 ఏళ్ల తర్వాత మహిళల హాకీలో పతకం, అంబరాన్ని అంటిన సంబురాలు.. వైరల్ వీడియో
గోల్‌కీపర్, కెప్టెన్ సవిత పూనియా అన్నీ తానై అడ్డుగోడలా నిలబడటంతో... 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. చివరి క్షణాల్లో చేసిన పొరపాటు వల్ల షూటౌట్ దాకా వెళ్లిన భారత్... కెప్టెన్ సవిత చురుకైన ప్రదర్శన వల్లే ‘షూటౌట్’లో 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. Watch | Indian women's hockey team celebrates their victory in the Bronze medal match in #CommonwealthGames2022 @Media_SAI@YASMinistry | @TheHockeyIndia#CWG2022 | #Cheer4India pic.twitter.com/MWGvsDsruM— DD News (@DDNewslive) August 7, 2022 ఆట 29వ నిమిషంలో సలీమా టెటె చేసి గోల్‌తో 1–0తో ఆఖరి దాకా ఆధిక్యంలో నిలిచిన భారత్... ఇంకొన్ని క్షణాల్లో మ్యాచ్ గెలిచేందుకు సిద్ధమైపోయింది. 30 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా... కివీస్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా ఒలీవియా మెర్రీ (60వ ని.) దాన్ని గోల్‌గా మలిచింది. 1–1తో సమంకాగా, షూటౌట్ అనివార్యమైంది. భారత బృందంలో తొలి షాట్లో సంగీత గురి తప్పగా... రెండు, మూడు షాట్లలో సోనిక, నవనీత్ స్కోరు చేశారు. నాలుగో షాట్లో నేహా విఫలమైంది. న్యూజిలాండ్ జట్టులో తొలి షాట్‌ను మేగన్ హల్ మాత్రమే గోల్‌పోస్ట్‌లోకి తరలించగా... మిగతా నాలుగు షాట్లను రాల్ఫ్ హోప్, రోజ్ టైనన్, కేటీ డోర్, ఒలీవియా షనన్‌ల షాట్లను సవిత అడ్డుకుంది. కామన్వెల్త్ గేమ్స్ మహిళల హాకీలో భారత్‌కిది మూడో పతకం. 2002 గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా 2006లో రజతం సాధించింది. -
Commonwealth Games 2022: కనకాభిషేకం
బ్రిటిష్ గడ్డపై భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ గీతం మారుమోగింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత క్రీడాకారులు ఒకరి తర్వాత మరొకరు పసిడి పతకాలు సాధించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో మనోళ్లు బంగారంలాంటి ప్రదర్శన చేయగా... బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ఫైనల్లోకి దూసుకెళ్లి మూడు స్వర్ణ పతకాల రేసులో నిలిచారు. మహిళల హాకీలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పతకం సొంతం చేసుకోగా... టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట పురుషుల డబుల్స్‌లో రజతం పతకంతో మెరిసింది. బర్మింగ్‌హామ్: పంచ్ పంచ్కూ పతకం తెచ్చి కామనెŠవ్ల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత బాక్సర్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్... 48 కేజీల విభాగంలో హరియాణా అమ్మాయి నీతూ ఘంఘాస్... పురుషుల 51 కేజీల విభాగంలో హరియాణాకే చెందిన అమిత్ పంఘాల్ స్వర్ణ పతకాలు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి పాల్గొంటున్న నిఖత్ జరీన్ ఫైనల్లో 5–0తో కార్లీ మెక్నాల్ (నార్తర్న్ ఐర్లాండ్)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–0తో డెమీ జేడ్ రెస్టాన్ (ఇంగ్లండ్)పై... అమిత్ 5–0తో డిఫెండింగ్ చాంపియన్ కియరాన్ మెక్‌డొనాల్డ్ (ఇంగ్లండ్)పై గెలుపొందారు. తాజా విజయంతో 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో కియరాన్ చేతిలో ఎదురైన ఓటమికి అమిత్ బదులు తీర్చుకున్నాడు. కార్లీతో జరిగిన ఫైనల్లో నిఖత్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. లెఫ్ట్ హుక్, రైట్ హుక్ పంచ్‌లతో కార్లీని కంగారెత్తించిన నిఖత్ ప్రత్యర్థి తనపై పంచ్‌లు విసిరిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుంటూ అద్భుత డిఫెన్స్‌ను కనబరిచింది. ఈ గేమ్స్‌లో స్వర్ణం గెలిచే క్రమంలో నిఖత్ నాలుగు బౌట్లలోనూ తన ప్రత్యర్థులకు ఒక్క రౌండ్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్లో నిఖత్ పంచ్‌ల ధాటికి రిఫరీ బౌట్‌ను మధ్యలోనే నిలిపివేయగా... క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో నిఖత్ 5–0తో గెలుపొందింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల 67 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ రోహిత్ టొకాస్ 2–3తో స్టీఫెన్ జింబా (జాంబియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్ 92 కేజీల విభాగం సెమీఫైనల్లో సాగర్ (భారత్) 5–0తో ఇఫెయాని (నైజీరియా)పై గెలిచి డెలిషియస్ ఒరీ (ఇంగ్లండ్)తో స్వర్ణ–రజత పోరుకు సిద్ధమయ్యాడు. -
పట్టు వదలని భారత మహిళా హాకీ జట్టు.. సెమీస్‌లో రిఫరీ దెబ్బకొట్టినా కాంస్యం సొంతం
CWG 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. తొమ్మిదో రోజు వరకు మొత్తం 40 పతాకలు (13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు) సాధించిన భారత్.. పదో రోజు ఆరంభంలోనే రెండు స్వర్ణాలు, మరో కాంస్యం సాధించి పతకాల సంఖ్యను 43కు పెంచుకుంది. మహిళల బాక్సింగ్ 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసరగా.. మహిళల హాకీలో భారత్ కాంస్యం చేజిక్కించుకుంది. సెమీస్‌లో (ఆస్ట్రేలియా) అంపైర్ తప్పిదం కారణంగా స్వర్ణం లేదా రజతం గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన భారత మహిళా హాకీ జట్టు.. కాంస్య పతక పోరులో అసమాన పోరాట పటిమ కనబర్చి పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్‌పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది. మ్యాచ్ కొద్ది సెకెన్లలో (18 సెకెన్లలో) ముగుస్తుందనగా న్యూజిలాండ్ గోల్ చేసి 1-1తో స్కోర్‌ను సమం చేయడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున సోనికా, నవ్‌నీత్ కౌర్ గోల్స్ సాధించగా.. కివీస్ తరఫున మెగాన్ హల్ మాత్రమే గోల్ చేయగలిగింది. చదవండి: Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు -
Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు
ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో భారత మహిళలు అసమానంగా పోరాడారు. ఆరంభంలోనే ఆధిక్యం కోల్పోయినా ఆ తర్వాత కోలుకొని సత్తా చాటారు. చివర్లో ఎదురుదాడికి దిగి లెక్క సరి చేశారు కూడా. దాంతో ఫలితం పెనాల్టీ షూటౌట్‌కు చేరింది. అక్కడా ప్రత్యర్థి తొలి ప్రయత్నాన్ని కీపర్ సవిత అద్భుతంగా అడ్డుకోగలిగింది. ఇదే జోరు కొనసాగిస్తే విజయం సాధించడం ఖాయమనిపించింది. కానీ ఇక్కడే రిఫరీ భారత్‌ను దెబ్బ కొట్టింది. ‘గడియారం గంట కొట్టలేదంటూ’ మొదటి గోల్ ప్రయత్నంలో లెక్కలోకి రాదంది. మళ్లీ పెనాల్టీ తీసుకునేందుకు ఆసీస్‌కు అవకాశం కల్పించింది. దాంతో ఏకాగ్రత చెదిరిన మన మహిళలు ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం కోల్పోయారు. షూటౌట్లో తడబడి చివరకు ఓటమి పక్షాన నిలిచారు. భారత్ పరాజయానికి ఆటలో వైఫల్యంకంటే అసమర్థ రిఫరీనే కారణమనడంలో సందేహం లేదు. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియా పెనాల్టీ షూటౌట్లో 3–0 తేడాతో భారత్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. మ్యాచ్ 10వ నిమిషంలో ఆస్ట్రేలియా తరఫున రెబెకా గ్రీనర్ గోల్ చేయగా, 49వ నిమిషంలో భారత్ తరఫున వందనా కటారియా గోల్ నమోదు చేసింది. తొలి క్వార్టర్లో వెనుకబడిన భారత జట్టు తర్వాతి రెండు క్వార్టర్లలో దూకుడుగా ఆడింది. గోల్ లేకపోయినా ఆసీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించగలిగింది. అదే ఊపులో చివరి క్వార్టర్లో గోల్‌తో స్కోరు సమం చేసింది. పెనాల్టీ షూటౌట్లో ఆస్ట్రేలియా నుంచి ఆంబ్రోసియా మలోన్, కైట్లిన్ నాబ్స్, ఎమీ లాటన్ గోల్స్ చేయగా... భారత్ నుంచి లాల్రెమ్సియామి, నేహ, నవనీత్ కౌర్ విఫలమయ్యారు. కాంస్యం కోసం నేడు జరిగే పోరులో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. ఏం జరిగింది... తొలి పెనాల్టీని మలోన్ తీసుకోగా, భారత కీపర్ సవిత దానిని గోల్ కాకుండా సమర్థంగా అడ్డుకోగలిగింది. అంతా ముగిసిన తర్వాత అది చెల్లదని, మళ్లీ పెనాల్టీ తీసుకోవాలని రిఫరీ ఆదేశించింది. పెనాల్టీ సమయం గరిష్టంగా 8 సెకన్లు చూపించే ‘స్టాప్‌వాచ్’ టైమర్ స్టార్ట్ కాలేదని, దానికి ముందే పెనాల్టీ తీసుకున్నందున గుర్తించలేమని రిఫరీ ప్రకటించింది. నిబంధనల ప్రకారమైతే మైదానంలో ఉండే టెక్నికల్ అఫీషియల్ ముందుగా చేయి పైకెత్తుతారు. ఆ తర్వాత చేతిని కిందికి దించితే ‘టైమర్’ ప్రారంభమవుతుంది. అదే సమయంలో రిఫరీ విజిల్ వేస్తే పెనాల్టీ తీసుకోవాలి. అయితే ఈ టెక్నికల్ అఫీషియల్ చేతికి కిందకు దించలేదు. ఇది పూర్తిగా ఆమె తప్పు. దాంతో స్టాప్‌వాచ్‌ను మరో అధికారిణి స్టార్ట్ చేయలేదు. దానిని గుర్తించి ‘నో నో’ అనే లోపే పెనాల్టీ ముగిసిపోయింది. దీనిని ఆమె వివరించడంతో రిఫరీ మళ్లీ పెనాల్టీ తీసుకోవాల్సిందిగా కోరింది. మా ఓటమికి దీనిని సాకుగా చెప్పను. అయితే మొదటి పెనాల్టీని ఆపితే సహజంగానే వచ్చే ఉత్సాహం ఆ తర్వాత నీరుగారిపోయింది. అందరం చాలా నిరాశ చెందాం. తాము పెనాల్టీని కోల్పోయామని గుర్తించిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు రిఫరీ ఎందుకు కల్పించుకోవాలి. అధికారులు ఆటతో పాటు ముడిపడి ఉండే భావోద్వేగాలని అర్థం చేసుకోలేరు. –భారత కోచ్ జేనెక్ స్కాప్‌మన్ -
పతకం దిశగా దూసుకుపోతున్న భారత అమ్మాయిలు
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు పతకం దిశగా దూసుకుపోతుంది. క్వార్టర్ ఫైనల్లో భారత అమ్మాయిలు కెనడాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు. ఈ విజయంతో భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. భారత్ గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఘనాపై 5-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్.. ఆతర్వాతి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1 తేడాతో గెలుపొందింది. అయితే ఇంగ్లండ్‌తో తదుపరి జరిగిన మ్యాచ్‌లో 1-3 తేడాతో ఓటమిపాలవ్వడంతో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. అనంతరం కెనడాతో మ్యాచ్‌లో పుంజుకున్న భారత అమ్మాయిలు.. అద్భుతంగా రాణించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నారు. సలీమా టెటె, నవనీత్ కౌర్, లాల్రెమ్సియామి తలో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్.. కెనడాతో సమానంగా ఆరు పాయింట్లు సాధించినప్పటికీ, ఎక్కువ గోల్స్ చేసిన కారణంగా కెనడా గ్రూప్-ఏలో అగ్ర జట్టు హోదాలో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే, ఆరో రోజు లవ్‌ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. మరో 3 పతకాలు భారత జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్‌పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. చదవండి: CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు -
టీమిండియాను వదలని మహమ్మారి.. తాజాగా మరొకరికి పాజిటివ్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందాన్ని కరోనా మహమ్మారి వీడటం లేదు. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు ప్లేయర్లు (సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్) మహమ్మారి బారిన పడగా.. తాజాగా మహిళా హాకీ జట్టు మిడ్ ఫీల్డర్ నవ్‌జోత్ కౌర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నవ్‌జోత్‌కు ఇవాళ (జులై 30) ఉదయం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఐసోలేషన్‌కు తరలించారు. ఆమెకు మరో రెండు రోజుల్లో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని భారత బృందానికి సంబంధించిన అధికారి తెలిపారు. ఒకవేళ అప్పటికీ ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ రాకపోతే కామన్వెల్త్ విలేజ్ నుంచి స్వదేశానికి పయనం కావాల్సి ఉంటుందని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడా గ్రామంలో రోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూడటం పరిపాటిగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఓ చోట కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ క్రీడల్లో భాగంగా ఘనాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు 5-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: CWG 2022: భారత్ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం -
ఎట్టకేలకు ఒక విజయం.. ప్రపంచకప్‌లో భారత్ బోణీ
థెరస (స్పెయిన్): మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఎట్టకేలకు ఒక విజయాన్ని సాధించింది. ఇప్పటికే పతకం రేసుకు దూరమైన అమ్మాయిల జట్టు వర్గీకరణ మ్యాచ్‌లో షూటౌట్లో కెనడాను కంగుతినిపించింది. 9 నుంచి 16 స్థానాల కోసం మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సవిత పూనియా సేన షూటౌట్లో 3–2తో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1–1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. కెప్టెన్ సవిత గోల్‌పోస్ట్ వద్ద అడ్డుగోడగా మారి షూటౌట్లో భారత్‌ను గెలిపించింది. షూటౌట్ సహా మ్యాచ్ మొత్తమ్మీద ఆమె ఏకంగా ఆరు గోల్స్‌ను చాకచక్యంగా అడ్డుకుంది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన షూటౌట్లో భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్, సోనిక, నేహా గోల్స్ సాధించారు. 11వ నిమిషంలోనే మ్యాడిలైన్ సికో కెనడా తరఫున ఖాతా తెరిచింది. ఆ తర్వాత పలు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా భారత రక్షణ పంక్తి సమర్థంగా అడ్డుకుంది. అయితే రెండు క్వార్టర్లు ముగిసినా గోల్ చేయడంలో వెనుకబడిపోయిన భారత అమ్మాయిలపై ఒత్తిడి పెరిగింది. మూడో క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు సువర్ణావకాశం వచ్చింది. కానీ నవ్‌జ్యోత్ కౌర్ కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ బార్‌ను తాకుతూ బయటికి వెళ్లిపోయింది. మరోవైపు కెనడా ఫార్వర్డ్ లైన్ దాడులను కొనసాగించింది. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్టుకు మరో పెనాల్టీ కార్నర్ లభించగా, సవిత అసాధారణ డైవింగ్‌తో వారి ప్రయత్నాన్ని విఫలం చేసింది. ఎట్టకేలకు భారత అమ్మాయిలు ఆఖరి క్వార్టర్లో అది కూడా మ్యాచ్ ముగిసే సమయంలో కెనడా గెలుపుదిశను మార్చేశారు. 58వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌పోస్ట్ దిశగా గుర్జీత్ కౌర్ కొట్టిన షాట్ రీబౌండ్ కాగా సలిమా టేటే సమయస్ఫూర్తితో గోల్‌గా మలిచింది. దీంతో స్కోరు 1–1తో సమమై షూటౌట్‌కు దారితీసింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగే పోరులో భారత్... జపాన్‌తో తలపడుతుంది. -
ప్రపంచకప్ బరిలో నుంచి టీమిండియా ఔట్
భారీ అంచనాల నడుమ ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆతిధ్య స్పెయిన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సవిత పూనియా నేతృత్వంలోని టీమిండియా 0-1 తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా కనీసం క్వార్టర్స్‌కు కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు చివరి నిమిషం వరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ] Full-time ESP 1-0 IND 📲 - Watch the games LIVE on https://t.co/igjqkvzwmV in 🇨🇦🇰🇷🇨🇳🇯🇵🇿🇦#HWC2022 #HockeyEquals #ESPvIND pic.twitter.com/SrxzXOiU3J — International Hockey Federation (@FIH_Hockey) July 10, 2022 మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా.. మార్తా సేగు గోల్ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. ఈ విజయంతో స్పెయిన్.. న్యూజిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో పాటు క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. క్వార్టర్స్ మ్యాచ్‌లు రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయి. జులై 16, 17 తేదీల్లో సెమీస్.. 18న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. చదవండి: Shooting World Cup: ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అర్జున్, పార్థ్