అమెరికా చేతిలో ఓడిన భారత్ | Image for the news result Indian Women's Hockey Team Lose 2-3 to United States in Opener | Sakshi
Sakshi News home page

అమెరికా చేతిలో ఓడిన భారత్

Jul 20 2016 12:18 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికా చేతిలో ఓడిన భారత్ - Sakshi

అమెరికా చేతిలో ఓడిన భారత్

భారత మహిళల హాకీ జట్టు తమ అమెరికా పర్యటనను ఓటమితో ఆరంభించింది. రియో ఒలింపిక్స్‌కు చివరి సన్నాహకంగా భావిస్తున్న...

మహిళల హాకీ
మన్‌హీమ్ (అమెరికా): భారత మహిళల హాకీ జట్టు తమ అమెరికా పర్యటనను ఓటమితో ఆరంభించింది. రియో ఒలింపిక్స్‌కు చివరి సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో 2-3 తేడాతో భారత్ ఓడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ప్రీతి దూబే (33వ నిమిషంలో), దీపిక (38) గోల్స్ సాధించారు. అమెరికా నుంచి కథ్లీన్ షార్కే (6), కేటీ బామ్ (31), కెల్సీ కొలోజెచిక్ (48) గోల్స్ చేశారు. రేపు (గురువారం) అమెరికాతో రెండో మ్యాచ్ జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement