రీల్స్‌ పిచ్చి.. పులి దాడిలో 19 ఏళ్ల యువకుడు మృతి.. | Tigress Mauls Pak Teen To Death At TikTok Video Shoot | Sakshi
Sakshi News home page

రీల్స్‌ పిచ్చి.. పులి దాడిలో 19 ఏళ్ల యువకుడు మృతి..

Nov 14 2026 3:30 AM | Updated on Nov 14 2026 3:30 AM

Tigress Mauls Pak Teen To Death At TikTok Video Shoot

ఇస్లామాబాద్‌ : సోషల్ మీడియాలో విపరీతంగా వ్యూస్ సంపాదించాలనే దురాశ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో టిక్‌టాక్ వీడియో కోసం తెచ్చిన ఒక క్రూరమైన పులి  రెచ్చిపోయి చేసిన దాడిలో 19 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంచలన ఘటనకు సంబంధించి ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌తో పాటు ఫామ్‌హౌస్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.

లాహోర్‌లోని కహ్నా ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ బ్రీడింగ్ ఫామ్‌హౌస్‌కు నౌమాన్ హసన్  అనే ప్రముఖ టిక్‌టాక్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఒక సరికొత్త వీడియో తీయాలనే ఉద్దేశంతో, ఆ ఫామ్‌హౌస్‌లో బోనులో బంధించి ఉన్న పెద్ద పులిని  బయటకు తీయాలని కోరాడు.

ఆ వీడియో షూట్ చేస్తున్న సమయంలో పులి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న తల్హా  అనే 19 ఏళ్ల యువకుడిపై ఆ పులి ఒక్కసారిగా పంజా విసిరింది.

పులి దాడిలో తీవ్రంగా గాయపడిన తల్హాను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడం, శరీరమంతా గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.

 ఈ దారుణ ఘటన జరిగిన తర్వాత నిందితులు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఒక నాటకానికి తెరలేపారు. పులి దాడిలో యువకుడు చనిపోయాడనే విషయాన్ని కప్పిపుచ్చి, అతన్ని ఏదో కుక్క కరిచి చనిపోయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, స్థానిక పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి. సోషల్ మీడియా వీడియో మోజులో పడే ఆ పులిని బోనులో నుంచి బయటకు తీశారని, నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు.

ఈ ఘటనపై లాహోర్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. టిక్‌టాకర్ నౌమాన్ హసన్‌తో పాటు ఫామ్‌హౌస్ యజమాని ఫయ్యాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement