రష్యాపైకి 1,200 డ్రోన్లు ప్రయోగించిన ఉక్రెయిన్‌ | Ukraine fires nearly 1200 drones at Russia | Sakshi
Sakshi News home page

రష్యాపైకి 1,200 డ్రోన్లు ప్రయోగించిన ఉక్రెయిన్‌

Nov 14 2026 2:10 AM | Updated on Nov 14 2026 2:10 AM

Ukraine fires nearly 1200 drones at Russia

కీవ్‌: రష్యాతో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు సీరియస్‌గా జరుగుతున్న వేళ ఉక్రెయిన్‌ జూలు విదిల్చింది. గురువారం రాత్రి ఏకంగా 1,200 డ్రోన్లను రష్యాపైకి ప్రయోగించింది. రష్యా దురాక్రమణ మొదలైన ఐదేళ్లలో చేపట్టిన అతిపెద్ద గగనతల దాడుల్లో ఇదొకటని చెబుతున్నారు. గురువారం రాత్రి మొదలు శుక్రవారం ఉదయం వరకు తమ దేశంలోని మూడు ప్రాంతాలపైకి ఉక్రెయిన్‌ ప్రయోగించిన 1,198 లాంగ్‌ రేంజ్‌ డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.

 ఈ దాడులకు సంబంధించిన వివిధ ఘటనల్లో 12 ఏళ్ల చిన్నారి సహా ఏడుగురు చనిపోగా, 17 మంది గాయపడ్డారంది. కాగా, రష్యా ప్రయోగించిన 117 డ్రోన్లను కూల్చివేశామని, ఇందుకు సంబంధించిన ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు చిన్నారులు సహా 13 మంది గాయపడినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement