హైదరాబాద్‌లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగి, నగరవాసులు గజగజ వణుకుతున్నారు.
అయితే, వారం రోజుల కిందటే నగరంలో చలి తీవ్రత మొదలైంది.
తుఫాన్ల ప్రభావంతో శీతాకాల రాత్రులు వెచ్చగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేసినా... దీపావళి నుంచి చలి క్రమంగా పెరుగుతోంది.
ఉత్తరాది నుంచి వీస్తున్న పొడిగాలులు చలిని మరింత పెంచుతున్నాయి.
శివారుల్లో, ముఖ్యంగా పచ్చదనం ఎక్కువగా ఉండేచోట ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి.
గురువారం రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నగరంలో మాత్రం సగటున 16.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.


